Best Web Hosting Provider In India 2024

WeightLoss Laddu Recipe: అధిక బరువును తగ్గించే లడ్డూ ఒకటుంది. దీన్ని తింటే త్వరగా బరువు తగ్గుతారు. ప్రపంచంలో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్య బరువు పెరగడం. ఆరోగ్యకరమైన ఆహారం ద్వారా బరువును తగ్గించుకోవాలి. వ్యాయామం క్రమం తప్పకుండా చేయడంతో పాటూ పోషకాహారాన్ని, కొవ్వులేని ఆహారాన్ని తింటే బరువు పెరగకుండా చూసుకోవచ్చు. బరువు తగ్గించే లడ్డూ రెసిపీ ఇక్కడ ఇస్తున్నాం.
ట్రెండింగ్ వార్తలు
బరువు తగ్గించే లడ్డూ కావాల్సిన పదార్థాలు
అవిసె గింజలు – పావు కప్పు
నువ్వులు – ఒక కప్పు
జీడిపప్పు తరుగు – మూడు స్పూన్లు
సోంపు గింజలు – ఒక స్పూను
యాలకుల పొడి – అర స్పూను
పల్లీలు – గుప్పెడు
బెల్లం తురుము – పావు కప్పు
ఖర్జురాలు – ఒక కప్పు
బాదం తరుగు – మూడు స్పూన్లు
గుమ్మడి గింజలు – రెండు స్పూన్లు
పిస్తా తరుగు – రెండు స్పూన్లు
బరువు తగ్గించే లడ్డు రెసిపీ
1. స్టవ్ మీద కళాయి పెట్టుకొని చిన్న మంట మీద నువ్వులను వేయించాలి. ఆ నువ్వులు వేగాక ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి.
2. ఆ తరువాత గింజలు తీసేసిన ఖర్జూరాలను వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్ని గింజలను ఒకసారి వేయించి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు బెల్లం తరుగు, ఖర్జూర పండ్లను మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి.
4. ఆ ముద్దను తీసి ఒక గిన్నెలో పెట్టాలి. ఆ మిశ్రమంలో వేయించిన అన్ని నట్స్ వేసి కలపాలి.
5. వాటిని లడ్డూల్లా చుట్టుకోవాలి. పైన ఎండు కొబ్బరిని చల్లుకుంటే టేస్టీగా ఉంటుంది.
6. ఈ లడ్డూలను గాలి తగలకుండా ఒక జార్లో వేసి నిల్వ చేసుకోవచ్చు. ఇవి వారం రోజులు పాటు తాజాగా ఉంటాయి. రోజుకో లడ్డూను తింటే చాలు ఆకలి తక్కువగా వేస్తుంది. దీని ద్వారా ఎన్నో పోషకాలు శరీరానికి అందుతాయి కాబట్టి ఇతర ఆహారాలు తగ్గించినా పోషకాహార లోపం రాదు. ప్రతిరోజూ ఒకే సమయానికి లడ్డూను తినడం అలవాటు చేసుకోవాలి. నెల రోజుల్లోనే మీకు మంచి ఫలితం కనిపిస్తుంది.
ఇందులో వాడిన అన్ని పదార్థాలు మన ఆరోగ్యానికి మేలు చేసేవే. బాదం, పిస్తా వంటి వాటిలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. ఇవి మీ గుండెను కాపాడుతాయి. ఈ లడ్డూల్లో ఎక్కువ భాగం ఖర్జూరాలను వినియోగించాము. వీటిలో విటమిన్ డి ఉంటుంది. ఈ ఖర్జూరాలను తినడం వల్ల ఎముకలు బలంగా మారుతాయి. ఈ ఖర్జూరాల్లో పొటాషియం, మెగ్నీషియం, కాపర్, ఫాస్పరస్ అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలు అనారోగ్యం బారిన పడకుండా కాపాడతాయి. ఖర్జూరం తర్వాత అధికంగా ఇందులో వినియోగించింది బెల్లం. ఇది రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది. శరీరానికి ఇనుమును అందిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేయడంతో పాటు జీవక్రియ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. కాబట్టి ప్రతిరోజూ బెల్లాన్ని తినడం చాలా ముఖ్యం.
టాపిక్