Best Web Hosting Provider In India 2024

CM YS Jagan Review : వైయస్సార్ పెన్షన్ కానుక, వైయస్సార్ ఆసరా, వైయస్సార్ చేయూత, అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవం తదితర కార్యక్రమాలపై సీఎం జగన్ సమీక్షించారు. కలెక్టర్లకు పలు విషయాలపై దిశానిర్దేశం చేశారు. ఎక్కడా పొరపాట్లు లేకుండా అధికారులు చూసుకోవాలని… జనవరి నుంచి పెరిగిన పెన్షన్ పంపిణీలో ఎమ్మెల్యేలు పాల్గొనాలన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంత పెద్దమొత్తంలో పెన్షన్ ఇవ్వలేదని… వందశాతం హామీలను నెరవేర్చాలని ప్రభుత్వం ముందుకెళ్తోందని చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు లబ్దిదారులకు తెలియాలని చెప్పారు.
ట్రెండింగ్ వార్తలు
ప్రతి కార్యక్రమానికి ప్రీలాంచ్, లాంచ్, పోస్ట్ లాంచ్ కార్యక్రమాలు ఉంటాయన్నారు ముఖ్యమంత్రి జగన్. అవి సక్రమంగా నడిచేలా కలెక్టర్లు షెడ్యూల్ చేసుకోవాలని… జనవరి నుంచి వైఎస్సార్ పెన్షన్ కానుక రూ.3 వేలకు పెంచుతున్నట్లు తెలిపారు. రూ.3 వేలకు పెన్షన్ పెంచుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని పూర్తిగా నెరవేరుస్తున్నామని… విశ్వసనీయతకు ఈ ప్రభుత్వం మారు పేరు అని రుజువు చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు.
మన రాకముందు రాష్ట్రంలో పెన్షన్ల సంఖ్య 39 లక్షలుగా ఉంటే… ఇవాళ 66 లక్షలకు చేరిందన్నారు. ప్రతి అడుగులోనూ కూడా ఏ లబ్ధిదారు మిగిలిపోకూడదని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి జగన్. ఎవ్వరూ కూడా ఇబ్బందులు పడకూడదని ఎప్పుడూ లేని విధంగా వాలంటీర్ , సచివాలయ వ్యవస్థను గ్రామస్థాయిలో తీసుకు వచ్చామని గుర్తు చేశారు. ఇక జనవరి 19న అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నామని చెప్పారు సీఎం జగన్. జనవరి 23 నుంచి 31 ఆసరా కార్యక్రమం జరుగుతుందని… నాలుగో కార్యక్రమం వైఎస్సార్ చేయూత కార్యక్రమం ఫిబ్రవరి 5 నుంచి 14వరకూ కొనసాగుతుందన్నారు. ప్రభుత్వం చాలా ప్రతిష్ట్మాత్మకంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తుందని.. అర్హత ఉండీ ఎవరైనా ఎక్కడైనా మిగిలిపోయిన సందర్భాల్లో వారికి పథకాలు వర్తింపు చేసే బై యాన్యువల్ కార్యక్రమం జనవరి 5న జరుగుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ కార్యక్రమం జరిగే లోపే దాదాపు 1.7 లక్షల పెన్షన్లు ఒకటో తేదీ నుంచే ఇస్తారన్న సీఎం జగన్… 66,34,742మందికి రూ.1968 కోట్లకుపైగా పెన్షన్ల రూపంలో అందుతాయన్నారు.
పెన్షన్ కానుక, ఆసరా, చేయూత లబ్ధిదారుల విజయగాధలను వీడియోల రూపంలో పంపాలన్నారు సీఎం జగన్. పంపిన వాటిలో అత్యుత్తమమైన వాటికి ఈ బహుమతులు ఇస్తామని… ఇవి మరికొందరిలో స్ఫూర్తిని పెంచుతాయని తెలిపారు. ఏ రకంగా ఈ పథకాలు, కార్యక్రమాలు వారి జీవితాలను మార్చాయో ఈ వీడియోల ద్వారా తీసుకోవాలని… సచివాలయాల్లో రూ.10 వేలు, మండల స్థాయిలో రూ.15 వేలు, నియోజకవర్గ స్థాయిలో రూ.20 వేలు, జిల్లా స్థాయిలో రూ.25 వేలు ఇస్తామన్నారు.