Best Web Hosting Provider In India 2024

Chicken Pulao Recipe: చికెన్ పులావ్ పేరు వింటేనే నోరూరిపోతుంది. దీన్ని చేయడం కష్టం అనుకుంటారు కానీ చాలా సులువుగానే దీన్ని వండేయచ్చు. ప్రెషర్ కుక్కర్లో పర్ఫెక్ట్ గా చికెన్ పులావ్ చేయడం ఎలాగో ఇక్కడ మేము చెబుతున్నాం. ఇలా ఫాలో అయిపోతే మీకు గంటలో చికెన్ పులావ్ రెడీ అయిపోతుంది. ఈ పులావ్ కోసం లేత మాంసాన్ని తీసుకోండి. అలాగే బాస్మతి బియ్యాన్ని రెడీ చేసుకోండి. పులావ్ పొడిపొడిగా వచ్చేందుకు పాత బియ్యాన్ని ఎంచుకోవడం మంచిది. అలాగే ముందుగానే బాస్మతి బియ్యాన్ని నానబెట్టుకోవాలి.
ట్రెండింగ్ వార్తలు
చికెన్ పులావ్ రెసిపీకి కావలసిన పదార్థాలు
లేత చికెన్ – అరకిలో
బాస్మతి బియ్యం – పావు కిలో
ఉల్లిపాయ – ఒకటి
టమోటో – ఒకటి
పెరుగు – పావు కప్పు
కొత్తిమీర తరుగు – రెండు స్పూన్లు
కారం – ఒక స్పూన్
పుదీనా తరుగు – రెండు స్పూన్లు
పసుపు – అర స్పూను
అల్లం వెల్లుల్లి పేస్టు – ఒక స్పూను
ఉప్పు – రుచికి సరిపడా
దాల్చిన చెక్క – చిన్న ముక్క
బిర్యానీ ఆకు – ఒకటి
గరం మసాలా – అర స్పూను
ధనియాల పొడి – ఒక స్పూను
లవంగాలు – ఐదు
యాలకులు – నాలుగు
జీలకర్ర పొడి – ఒక స్పూను
నీళ్లు – తగినన్ని
నూనె – తగినంత
షాజీరా – ఒక స్పూన్
చికెన్ పులావ్ రెసిపీ ఇలా
1. స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో నూనె వేయాలి. ఆ నూనెలో యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, షాజీరా వేసి వేయించాలి.
2. ఉల్లిపాయలను నిలువుగా కోసుకొని బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, పసుపు, గరం మసాలా వేసి వేయించాలి.
3. టమాటో ముక్కలను వేసి అవి బాగా మగ్గేలా మూత పెట్టాలి. టమాటా ముక్కలు గుజ్జులా అయ్యాక చికెన్ ముక్కలను వేసి నాలుగైదు నిమిషాలు పాటు ఉడికించాలి.
4. ఆ తర్వాత రెండు కప్పుల నీళ్లు పోయాలి. ముందుగానే బాస్మతి బియ్యాన్ని నానబెట్టుకోవాలి.
5. అలా నానబెట్టిన బియ్యాన్ని చికెన్ ముక్కల్లో వేసి కలపాలి. తర్వాత పెరుగు, పుదీనా తరుగు, కొత్తిమీర తరుగు వేసి బాగా కలపాలి.
6. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. విజిల్ పెట్టి రెండు విజిల్స్ వచ్చేదాకా ఉడకనివ్వాలి. తర్వాత స్టవ్ కట్టేయాలి. అంతే చికెన్ పులావ్ రెడీ అయినట్టే.
7. స్పైసీగా కావాలనుకునే వారు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి, లేదా కారాన్ని ఎక్కువ వేసుకున్నా సరిపోతుంది. ఈ చికెన్ పులావ్ స్పైసీగా, చాలా టేస్టీగా ఉంటుంది.
8. ఒక్కసారి చేస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుంది. దీనిని వండడం కూడా చాలా సులువు కాబట్టి అప్పటికప్పుడు చేసుకోవచ్చు.
టాపిక్