ఎన్టీఆర్ జిల్లా / కంచికచర్ల(పెండ్యాల) :
ది.17-7-2022 (ఆదివారం) ..
పెండ్యాల గ్రామంలో తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన 20 కుటుంబాలు ..
పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
కంచికచర్ల మండలంలోని పెండ్యాల గ్రామంలో ఎంపీపీ మలక్ బషీర్ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీకి చెందిన సయ్యద్ అహ్మద్ -నూర్ మహమ్మద్- షేక్ ఖాజా -నసీర్ లు వారి కుటుంబాలు తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు , పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే డాక్టర్ జగన్ మోహన్ రావు గారు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు ,
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పాలనతో ప్రజల గుండెల్లో స్థానం సంపాదించారని – రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ పథకాల అమలుతో పాటు ,నందిగామ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై పలువురు తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని వారందరికీ సాదరంగా స్వాగతం పలుకుతున్నామని తెలిపారు , పేద బడుగు బలహీన వర్గాలైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల జీవితాల్లో వెలుగులు నింపే విధంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ..
ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బడే హజరత్ పలువురు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..