ఎన్టీఆర్ జిల్లా / కంచికచర్ల మండలం :
ది.05-10-2022(బుధవారం) ..
మొగులూరు గ్రామంలో నూతన సచివాలయ భవనాన్ని , సొసైటీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు , ఎమ్మెల్సీ డాక్టర్ మొండితాప అరుణ్ కుమార్ గారు ,కేడీసీసీబీ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు గారు ..
ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకే గ్రామ సచివాలయాలు ..
కంచికచర్ల మండలంలోని మొగులూరు గ్రామంలో రూ.40 లక్షల అంచనా విలువతో నూతనంగా నిర్మించనున్న గ్రామ సచివాలయ భవనాన్ని , రూ.35 లక్షలతో నిర్మించిన సొసైటీ భవనాన్ని శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు , శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు , కేడిసిసి బ్యాంక్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు గారు ప్రారంభోత్సవం చేశారు ..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు మెరుగైన పాలన అందించడమే ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యమన్నారు , ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల ఇళ్ల ముంగిటే అందించేందుకు గ్రామ వాలంటీర్ ,గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను రూపొందించారని తెలిపారు ,ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టే ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలను ప్రాధాన్యత క్రమంలో అమలు చేస్తున్నారని చెప్పారు ,
ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి గత ప్రభుత్వం మోసం చేస్తే అధికారంలోకి వచ్చిన నెలల వ్యవధిలోనే లక్షల సంఖ్యలో ఉద్యోగాలు కల్పించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని పేర్కొన్నారు , గ్రామ సచివాలయాల ద్వారా దాదాపు 500 కు పైగా సేవలను అందించడం జరుగుతుందని ,ముఖ్యంగా 72 గంటల్లో సమస్య పరిష్కరించేందుకు అవసరమైన అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు ,
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆవుల సామ్రాజ్యం ,వైస్ ఎంపీపీ బండి మల్లికార్జునరావు , బండి జానకి రామయ్య , జడ్పిటిసి వేల్పుల ప్రశాంతి , షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ షహనాజ్ బేగం ,ఎంపీటీసీ సభ్యులు ,సచివాలయ సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు ..