Nindu Noorella Saavasam December 30th Episode: ఆరు ఆత్మతో మనోహరి ప్రయోగం.. అంజుపై హత్యాయత్నం.. చిత్రగుప్తుడి వార్నింగ్

Best Web Hosting Provider In India 2024

Nindu Noorella Saavasam 30th December Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని అందరూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ భోజనం చేస్తూ ఉంటారు. కానీ, మనోహరి మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది. భాగమతి, అరుంధతి ఇద్దరు అక్కచెల్లెళ్లు అవ్వటం, అక్క పిల్లలు అని తెలియకపోయినా మిస్సమ్మ ఇక్కడికి రావడంతో కోపంతో ఊగిపోతుంది మనోహరి.

 

ట్రెండింగ్ వార్తలు

షాక్ అయిన మనోహరి

తన గదిలోకి వెళ్లి రెస్ట్ తీసుకోవాలనుకున్న మనోహరి దగ్గరికి నీల వచ్చి మీతో మాట్లాడాలి అని అంటుంది. ఇప్పుడు కాదు రేపు పొద్దున్న మాట్లాడుకుందాం. ఈ రోజు నాకు బాగా అలసటగా ఉందని మనోహరి అంటుంది. ఎంత చెప్పినా వినిపించుకోకపోవడంతో ఇంట్లో ఆత్మ ఉంది అని నీల గట్టిగా చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది మనోహరి. ఏం మాట్లాడుతున్నావ్ అని కంగారుగా అడుగుతుంది మనోహరి. నిజమేనమ్మ ఇంట్లో ఆత్మ ఉందని నీల అంటుంది.

పొద్దున ఘోర కూడా అదే చెప్పాడు. అయినా ఎందుకో నమ్మాలి అనిపించలేదు. అయినా నువ్వు ఆత్మను చూసావా.. ఉంది అని అంత గట్టిగా ఎలా చెప్తున్నావ్ అని నీలని అడుగుతుంది మనోహరి.

ఆత్మతో మిస్సమ్మ మాట్లాడటం నేను చూశాను, మిస్సమ్మ ఆ ఆత్మని నాకు పరిచయం కూడా చేసింది. ఏం చెప్పాలో తెలియక కనిపించినట్లుగా నటించి వచ్చేసాను అని చెప్తుంది నీల. నాకు చాలాసార్లు ఆ వైబ్రేషన్ తెలిసింది. కానీ ఈ రోజుల్లో ఇంకా ఇవన్నీ ఏమిటి అని లైట్ తీసుకున్నాను. కానీ ఇప్పుడు అరుంధతి ఇంట్లోనే ఉంది అని టెన్షన్ పడిపోతూ చెమటలు కక్కుకుంటుంది మనోహరి.

 

కంగారుగా అరుంధతి

ఇప్పుడు ఏం చేద్దాం అమ్మ అని మనోహరిని అడుగుతుంది నీల. నాకేమీ బుర్ర పనిచేయటం లేదు అని తల పట్టుకుంటుంది మనోహరి. నిజంగానే ఆత్మ ఇక్కడే ఉందంటావా అని మళ్లీ అనుమానంగా నీలని అడుగుతుంది. ఉందమ్మా.. ఇప్పుడు మన పక్కనే ఉండి మన మాటలు కూడా వినొచ్చు అని నీల అనడంతో మరింత భయపడిపోతుంది మనోహరి. నిజంగానే అరుంధతి అక్కడ ఉండి వాళ్ల మాటలు వింటుంది.

దాంతో కంగారుగా చిత్రగుప్తుడి దగ్గరికి వెళ్లి నీల మనోహరికి నిజం చెప్పేసింది. ఇప్పుడు తను ఆత్మ ఉంది అని నమ్ముతుంది. ఇప్పుడు ఏం చేయటం అని కంగారుగా అడుగుతుంది అరుంధతి. చేయటానికి ఏమీ లేదు మనం ఈ లోకం విడిచి వెళ్లిపోవాలి, కూటములన్నీ బలపడుతున్నాయి మనం ఎంత త్వరగా వెళితే అంత మంచిది. లేదంటే కోరి కష్టాలు కొని తెచ్చుకున్న దానివి అవుతావు అని చిత్రగుప్తుడు అంటాడు. నువ్వు ఇక్కడ ఉండడం వల్ల సంతోషం కంటే దుఃఖమే ఎక్కువ. ఇంట్లో ఇప్పుడు ఉన్న నవ్వులు అప్పుడు ఉండవు అని హెచ్చరించి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

లైట్ తీసుకున్న అరుంధతి

గుప్తా గారు నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోవడానికి అలా చెప్తున్నారు అని లైట్ తీసుకుంటుంది అరుంధతి. ఆరోజు రాత్రి నీల అందరూ పడుకున్నది లేనిది చూసి మనోహరికి చెప్తుంది. మనోహరి నీలతో కలిసి చడిచప్పుడు లేకుండా పిల్లల గదికి వెళుతుంది. ఇప్పుడు ఎందుకమ్మా ఈ ప్రయోగాలు నేను, ఘోర ఇద్దరం చెప్తున్నాం కదా ఆత్మ ఉందని అంటుంది నీల. నేను కూడా తెలుసుకోవాలి ఒకవేళ అరుంధతి ఉంటే కచ్చితంగా పిల్లలున్న గదిలోనే ఉంటుంది. ఈసారి నాకు ఆ వైబ్రేషన్స్ తెలిస్తే కనుక రేపటి నుంచి దానికి మామూలుగా ఉండదు అని నీలకి చెప్పి పిల్లల గదిలోకి ప్రవేశిస్తుంది మనోహరి.

 

ఆ అలికిడికి పడుకున్న అరుంధతి నిద్రలేస్తుంది. ఈ గదిలో ఇక్కడికి వచ్చిందేటి అని అనుకుంటుంది. అదే పనిగా నించుని చూస్తున్న మనోహరితో ఇందాక అది అన్నమాటలు పట్టించుకున్నావా అని అడుగుతుంది. కానీ ఆమె మాటలు మనోహరికి వినిపించవు. మనోహరి పిల్లో తీసి అంజు మొహం మీద పెట్టటానికి ప్రయత్నిస్తుంది. కోపంతో రెచ్చిపోతుంది అరుంధతి. నా పిల్లల జోలికి వస్తే ఊరుకోను అంటూ ఆవేశపడుతుంది. ఆ వైబ్రేషన్ మనోహరీ ఫీల్ అవుతుంది.

ఎలాంటి సాయం

అంజు.. పిల్లో తీసి నీ తలకింద పెడదాం అనుకున్నాను. కానీ, ఏదో అడ్డుపడినట్లుగా ఉంది ఏంటది అని అమాయకంగా అంటుంది మనోహరి. నువ్వు అందుకు వచ్చావా సారీ ఏమీ అనుకోకు అని మనోహరికి సారీ చెప్తుంది అరుంధతి. మనోహరి అంజు తల కింద పిల్లో పెడుతుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది. అరుంధతి ఆత్మని పట్టుకునేందుకు మనోహరి ఘోరాకి ఎలా సాయం చేస్తుంది? మనోహరి గురించి అరుంధతికి నిజం తెలిసిపోతుందా? అనే విషయాలు తెలియాలంటే జనవరి 1న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!

WhatsApp channel
 
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *