Best Web Hosting Provider In India 2024
నంద్యాల, నర్సీపట్నం, తాడికొండ నియోజకవర్గాల్లో సాగనున్న బస్సు యాత్ర
అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనలో బడుగు వర్గాలకు జరిగిన మేలును వివరించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సామాజిక సాధికారక బస్సు యాత్ర శనివారం మూడు ప్రాంతాల్లో కొనసాగనుంది. నర్సీపట్నం, నంద్యాల, తాడికొండ నియోజకవర్గాల్లో బస్సు యాత్ర సాగనుంది. వైయస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి నేటి వరకు 55 నెలల పాలనలో జరిగిన సామాజిక న్యాయం, బడుగు, బలహీన వర్గాలకు అందించిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి ప్రజలకు వివరించడమే ఈ యాత్ర ప్రధాన ఉద్దేశం. రెట్టింపు ఉత్సాహంతో సామాజిక జైత్రయాత్రలా బస్సుయాత్ర జరగనుంది. ఈ యాత్రకు జిల్లా ఇన్చార్జి మంత్రులు, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు.