Alla Ramakrishna Reddy : షర్మిల వెంటే నేను – వైసీపీ టార్గెట్ గా ఆర్కే సంచలన వ్యాఖ్యలు

Best Web Hosting Provider In India 2024

Alla Ramakrishna Reddy : ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో మళ్లీ చేరే ప్రసక్తే లేదన్నారు. నియోజకవర్గానికి ఒక రూపాయి ఇవ్వలేదని విమర్శించారు. అభివృధి చేయ‌కుండా మ‌ళ్లీ ఓటు ఎలా అడ‌గాలన్న ఆయన… త్వరలోనే నా భవిష్యత్ ను ప్రకటిస్తానని చెప్పారు. రాజకీయాల్లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. భ‌విష్య‌త్తులో ష‌ర్మిల ఏ నిర్ణయం తీసుకున్నా ఆమె వెంటే న‌డుస్తానని చెప్పుకొచ్చారు.

 

ట్రెండింగ్ వార్తలు

చంద్రబాబుపై వేసిన కేసులపై న్యాయ పోరాటం చేస్తానని తేల్చి చెప్పారు ఆర్కే. రేవంత్ కాంగ్రెస్‌లో ఉన్నా.. షర్మిల కాంగ్రెస్‌కు వచ్చినా తన పోరాటం ఆగదన్నారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి స్వయంగా ఉన్నారు. ప్రస్తుతం సీఎం అయితే రేవంత్ రెడ్డి ఏమైనా గొప్పా? తప్పు ఎవ్వరూ చేసినా తప్పే అని చెప్పుకొచ్చారు. వైసీపీ సర్కార్ తప్పు చేస్తే వాటిపై కేసులు వేసేందుకు అయినా వెనకాడను అంటూ కామెంట్స్ చేశారు.

“వైఎస్‌ షర్మిలతోనే నా రాజకీయ ప్రయాణం.. షర్మిల రాజకీయాలపై నిర్ణయం ప్రకటించాక ఆమె వెంటే నడుస్తా. 2019 ఎన్నికల్లో లోకేశ్ పై పోటీ చేసి గెలిచాను. మంగళగిరి అభివృద్ధి కోసమే నన్ను గెలిపించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం 1200 కోట్లు కేటాయించారు సీఎం జగన్. అయితే ఆ నిధులను ఖర్చు చేసేందుకు డీపీఆర్ లు సిద్ధం చేశారు. అయితే వాటిని క్రమంగా 125 కోట్లకు కుదిస్తూ వచ్చారు. కేవలం 125 కోట్లు మాత్రమే ఇస్తూ జీవో ఇచ్చారు. ఇందుకు సంబంధించిన పనులు పూర్తి అయ్యాయి. కానీ నిధులు మాత్రం విడుదల కాలేదు. ఇదే విషయంలో ధనుంజయ రెడ్డితో చాలా సార్లు మాట్లాడినప్పటికీ డబ్బులు విడుదల కాలేదు. కాంట్రాక్టర్ల నుంచి తీవ్రమైన ఒత్తిడి వచ్చింది. స్వయంగా నేనే అప్పులు తీసుకొచ్చి కొన్ని ఇచ్చాను. దుగ్గిరాల విషయంలో నిధులు కేటాయించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఏం చేయాలి…? మరోసారి గెలవాలంటే సంక్షేమమే కాదు అభివృద్ధి చేయకుండా మంగళగిరి ప్రజలను ఏమని ఓట్లు అడగాలి..? అందుకే ఎవర్నీ నిందించకుండా పక్కకు జరిగాను. అందుకే ఎమ్మెల్యే పదవితో పాటు పార్టీకి కూడా రాజీనామా చేశాను” అని ఆర్కే చెప్పారు.

 

“నేను రాజశేఖర్ రెడ్డి అభిమానిని. జగన్ ను సీఎం చేసేందుకు సర్వం చేశాను. వైఎస్ షర్మిలను కలిశాను. షర్మిల రాజకీయంగా ఏదైనా నిర్ణయం తీసుకుంటే… ఆమె వెంట నడుస్తా. మంగళగిరి అభివృద్ధిని టీడీపీ, వైసీపీ వాళ్లు వెళ్లి చూడొచ్చు. ఎవరేం చేశారో తెలుస్తుంది. నన్ను ఇతర పార్టీల్లోకి రావాలని చాలా మంది ఆహ్వానించారు. కానీ నేను వైఎస్ కుటుంబంతోనే ఉ..న్నా ఉంటానని వారికి చెప్పా” అని ఆర్కే క్లారిటీ ఇచ్చారు.

 
WhatsApp channel
 

సంబంధిత కథనం

టాపిక్

 

Source / Credits

Best Web Hosting Provider In India 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *