Best Web Hosting Provider In India 2024
Parking OTT Streaming: ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో ఎప్పటికప్పుడూ సరికొత్త క్రేజీ చిత్రాలు వస్తూ అలరిస్తుంటాయి. ఇతర భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమాలు ఓటీటీల్లోకి వచ్చేసరికి అన్ని లాంగ్వెజెస్‌లో స్ట్రీమింగ్ అవుతుంటాయి. అలానే తాజాగా సరికొత్త సూపర్ హిట్ అండ్ క్రేజీ మూవీ ఒకటి ఓటీటీలోకి వచ్చేసింది.
ట్రెండింగ్ వార్తలు
రియల్ లైఫ్‌లో
నిజ జీవితంలో చాలా మందికి తెలియని ఓ సమస్యను సినిమాగా తీసి సూపర్ హిట్ కొట్టారు. తక్కువ బడ్జెట్‌తో చాలా సింపుల్ కథాంశంతో తీసిన పార్కింగ్ మూవీ తమిళ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రస్తుత కాలంలో జనాభ పెరిగిపోయింది. అవసరాలకు అనుగుణంగా 99 శాతం మంది టూ వీలర్స్ లేదా ఫోర్ వీలర్స్ వాడుతున్నారు.
పార్కింగ్ ఓటీటీ స్ట్రీమింగ్
అయితే వాహనాలు పెరిగిపోవడంతో ట్రాఫిక్‌కు ఇబ్బంది కావడమే కాకుండా పార్కింగ్ సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సమస్యపైనే తెరకెక్కిన మూవీ పార్కింగ్. డిసెంబర్ 1న థియేటర్లలో విడుదలైన పార్కింగ్ మూవీకి మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు నెల కాకముందే ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో పార్కింగ్ మూవీని స్ట్రీమింగ్ చేస్తున్నారు.
ఐదు భాషల్లో
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో డిసెంబర్ 30 నుంచి అంటే అర్ధరాత్రి నుంచే పార్కింగ్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంలో తెరకెక్కిన ఈ సినిమాను ఓటీటీలో తెలుగు, హిందీ,. కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేశారు. పార్కింగ్ మూవీలో హరీశ్ కల్యాణ్ హీరోగా చేశాడు. హరీశ్ ఇంతకుముందు జెర్సీ మూవీలో నాని కొడుకుగా నటించాడు.
పరిష్కారం ఏంటీ?
పార్కింగ్ కథలోకి వెళితే.. సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసే హీరో ఓ ఇంట్లో అద్దెకు ఉంటాడు. పెళ్లయిన తర్వాత కొత్త కారు కొంటాడు. అయితే, హీరో ఉంటున్న ఇంట్లో పార్కింగ్ సమస్య తలెత్తుతుంది. ఇంటి ఓనర్‌కు, హీరోకు మధ్య పెద్ద వాగ్వాదమే కాకుండా కొట్టుకునే దాకా వెళ్తారు. దాంతో అది పోలీసుల కేసు వరకు వెళ్తుంది. చివరికీ ఈ పార్కింగ్ సమస్యను ఎలా పరిష్కరించారనేదే మూవీ కథ.