ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ని దర్శించుకున్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు , ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తాం ..
విజయదశమిని పురస్కరించుకుని నందిగామ పట్టణంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో వాసవి అమ్మవారిని శాసన సభ్యులు -శాసన మండలి సభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు, డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు .. ముందుగా ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే -ఎమ్మెల్సీలకు ఆలయ కమిటీ సభ్యులు, వేదపండితులు ఆలయ మర్యాదలతో పూర్ణ కుంభ స్వాగతం పలికారు ..
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు మాట్లాడుతూ విజయదశమి రోజున వాసవి అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు , ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు ,ఈ సందర్భంగా ఆలయ పూజా కార్యక్రమాలు -వేడుకలు నిర్వహించుకునేందుకు ఆలయానికి ఉత్తర భాగాన గల రామలింగేశ్వర స్వామి దేవస్థానం భూమిని లీజు రూపంలో కేటాయించాలని ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్సీ దృష్టికి తీసుకురాగా ,వెంటనే స్పందించిన ఆయన రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన భూమి కోర్టు పరిధిలో ఉన్నందున లేదు అంశంపై దేవాదాయ శాఖ దృష్టికి తీసుకువెళ్లి -ఆ స్థలాన్ని శుభ్రం చేసి ఆలయాల పూజా కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు వీలుగా వినియోగంలోకి తీసుకొస్తామన్నారు , అదేవిధంగా రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించిన రథం శిథిలావస్థకు చేరుకోవడంతో ఆ రథం స్థానంలో కొత్త రథం చేయించే ఆలోచన చేస్తున్నామని ,అంతర్వేది – తిరువనంతపురం దేవాలయాల రథాలను రూపొందించిన ఆచార్యులను వచ్చే వారంలో రామలింగ స్వామి దేవస్థానానికి తీసుకొస్తున్నామని , ఆయనతో కలిసి రధాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు , అదేవిధంగా శివాలయం ముందు రోడ్డుపై వానకు తడిచి -ఎండకు ఎండి స్వామివారి ఊరేగింపు రథం దెబ్బతినే ప్రమాదం ఉన్నందున ఆ రధాన్ని కూడా వాసవి అమ్మవారి ఆలయ ఉత్తర భాగాన గల ఖాళీ స్థలంలో షెడ్ నిర్మించి అక్కడ రధాన్ని ఉంచేలా ఆలోచన చేస్తున్నామన్నారు .. రామలింగేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు రూ. కోటి 30 లక్షలు నిధులు తీసుకురావడం జరిగిందని గుర్తు చేశారు ,శివాలయానికి ఎదురుగా గల రథం ఉన్న ప్రదేశాన్ని చిన్న జంక్షన్ లా చేసి ,అక్కడ అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ,వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి విగ్రహం , మాజీ ముఖ్యమంత్రి రోశయ్య గారి విగ్రహం ఏర్పాటు చేసేలా ఆలోచన చేస్తున్నామన్నారు ..
ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య ప్రముఖులు చల్లా బ్రహ్మేశ్వర రావు ,పారేపల్లి సాయిబాబు , మారం అమరయ్య ,సముద్రాల మధుబాబు, నల్లమల్లి మురళి,పరిసే మల్లీ, రాచురి సీతారాం ,నకరికంటి నరేష్ ,కొత్త వేణుమాధవ్ తదితరులు పాల్గొన్నారు ..