Best Web Hosting Provider In India 2024
Veggies Storage tips: జాబ్ చేసే మహిళల సంఖ్య అధికంగానే ఉంది. బిజీ జీవితంలో ఎప్పటికప్పుడు వంట పనులను చేసుకోవడం కాస్త కష్టమే. ముఖ్యంగా ప్రతిరోజు వండేటప్పుడు కూరగాయలను తరిగి వంట చేసేసరికి ఆలస్యం అయిపోతుంది. కాబట్టి కూరగాయలను ముందుగానే తరిగి వారం రోజులకు సరిపడా ఫ్రిజ్లో నిల్వ చేసుకుంటే… వారికి వంట మరింత సులభం అవుతుంది. అయితే వారం రోజులకు ఇలా కూరగాయలను తరిగి పెట్టడం వల్ల అవి బ్యాక్టీరియా బారిన పడతాయేమోనని ఎంతోమందికి సందేహం ఉంది. అయితే తరిగిన కూరగాయలను వాటి రుచి, ఆకృతి మారకుండా తాజాగా ఉంచే కొన్ని చిట్కాలు ఉన్నాయి. వీటిని పాటిస్తే కూరగాయలు వారం రోజులు వరకు తాజాగా ఉంటాయి.
ట్రెండింగ్ వార్తలు
1. కూరగాయలను తరిగాక వాటిని డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టి గడ్డ కట్టేలా చేస్తే వాటి రంగు, ఆకృతి పోకుండా ఉంటాయి. వండే ముందు వాటిని బయటికి తీసి ఒక అరగంట పాటు బయటే ఉంచితే అవి మళ్లీ సాధారణ స్థితికి వస్తాయి. వీటిని వండినా కూడా తాజాగా ఉంటాయి.
2. తరిగిన కూరగాయలను సంరక్షించడానికి మరో సాంప్రదాయ మార్గం ఉంది. అదే వాటికి ఆలివ్ నూనె పూయడం. కూరగాయలను భద్రపరిచే డబ్బాలో అడుగుభాగాన ఆలివ్ నూనెను కోటింగ్‌లా వేయాలి. వాటిలో కూరగాయలు వేసి… ఆ కూరగాయలు పైకూడా ఆలివ్ నూనెతో కోటింగ్ వేయాలి. ఇలా చేయడం వల్ల వాటి తాజాదనం పోకుండా వారం రోజులు పాటు ఉంటాయి.
3. తరిగిన కూరగాయల రుచి, రంగు మారిపోకుండా ఉండేందుకు నిమ్మరసాన్ని వినియోగించవచ్చు. నిమ్మరసాన్ని కూరగాయల్లో కలిపి కోటింగ్ లా వేసి మూత పెట్టేసి… డీ ఫ్రిజ్లో పెడితే అవి తాజాగా ఉండే అవకాశం ఉంది.
4. ఉల్లిపాయలు, వెల్లుల్లి వంటివి తరిగాక నిల్వ చేయాలనుకుంటే ఇతర కూరగాయలతో కలపకండి. వాటిని విడిగానే నిల్వ చేయండి. ఇవి కలిస్తే మిగతా కూరగాయలు పాడైపోయే అవకాశం ఎక్కువ.
5. కూరగాయలు ఫ్రిడ్జ్ లో నిల్వ చేయాలనుకుంటే గాలి చొరబడకుండా చూసుకోవాలి. గాలి చొరబడితే త్వరగా అవి పాడయ్యే అవకాశం ఉంది. కాబట్టి కంటైనర్లను ప్రత్యేకంగా తీసుకొని వాటిలో నిల్వ చేయాలి.
6. తరిగిన కూరగాయలను రెండు, మూడు రకాలు కలిపి ఒకే కంటైనర్లో నిల్వ చేయవద్దు. అవి ఒక్కొక్కటి ఒక్కో గుణాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి త్వరగా పాడయ్యే అవకాశం ఉంది. ఉదాహరణకు టమాటాలు ఒక కంటైనర్లో, క్యారెట్ మరో కంటైనర్లో… ఇలా విడివిడిగా భద్రపరుచుకోవాలి.
7. తరిగిన కూరగాయలు వేసుకునేందుకు వాడే కంటైనర్ను పొడిగా ఉండేలా చూసుకోండి. అడుగున పొడి కాగితాన్ని వేయండి. టిష్యూ పేపర్లను వాడడం మంచిది. ఇవి అదనపు తేమను కూడా గ్రహించి బ్యాక్టీరియా పెరగకుండా అడ్డుకుంటాయి.
టాపిక్