Best Web Hosting Provider In India 2024
Guntur Kaaram Kurchi Madathapetti Song: ప్రస్తుతం ఎక్కడా విన్న మహేశ్ బాబు గుంటూరు కారం సినిమాలోని కుర్చీ మడత పెట్టి సాంగ్ గురించే చర్చ నడుస్తోంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న గుంటూరు కారం సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
ట్రెండింగ్ వార్తలు
పూర్తి పాట అప్పుడే
ఇదిలా ఉంటే ఇప్పటికీ గుంటూరు కారం నుంచి ధమ్ మసాలా, ఓ మై బేబీ సాంగ్స్ విడుదలయ్యాయి. వీటిలో ధమ్ మసాలా పాటకు మంచి రెస్పాన్స్ రాగా ఓ మై బేబీ పాటకు విమర్శలు వచ్చాయి. తాజాగా డిసెంబర్ 29న గుంటూరు కారం నుంచి కుర్చీ మడతపెట్టి సాంగ్ ప్రోమో విడుదల చేశారు. ఇవాళ అంటే డిసెంబర్ 30న సాయంత్ర 4.05 గంటలు పూర్తి పాటను రిలీజ్ చేయనున్నారు.
ఒక్క పదం తీసేయండి
ఈ పాటలో కుర్చీ తాతా అలియాస్ కాలా పాషా వాడిన బూతు పదంతో కంపోజ్ చేశారు. దీంతో పాటపై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. మహేశ్ బాబు లాంటి అగ్ర హీరో పాటలో ఇలాంటి బూతు పదాలు ఉండటం ఏంటీ, ఎంతోమంది ఫాలో అయ్యే మీ పాటలోని పదాలు ప్రభావం చూపుతాయి, కనీసం ఆ ఒక్క పదం తీసేయండి, లేకుంటా ఇలాంటి పదాల వల్ల పిల్లలు చెడిపోతారని ఓ జర్నలిస్ట్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఊహించలేదంటూ
అంతేకాకుండా సోషల్ మీడియాలో కుర్చీ మడతపెట్టి పాటపై తెగ ట్రోలింగ్, మీమ్స్ వస్తున్నాయి. అసలు గుంటూరు కారం నుంచి ఇలాంటి సాంగ్ వస్తుందని అస్సలు ఊహించలేదని అంటున్నారు. తమన్ కాపీ కొడతాడు ఓకే గానీ, మహేశ్ బాబు, త్రివిక్రమ్ దీన్ని ఎలా ఓకే చేశారంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ ట్రోలింగ్‌పై తాజాగా నిర్మాత నాగవంశీ రియాక్ట్ అయ్యారు.
టార్గెట్ చేసేందుకు
“ఉదయం రిలీజైన కుర్చీ మడతపెట్టి పాట ప్రోమోకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. కానీ, అక్కడక్కడా కొంతమంది పాటపై విమర్శలు చేస్తున్నారు. ప్రోమో గురించి చాలా అభిప్రాయాలు విన్నాం. కొంతమంది సాహిత్యం, కొన్ని పదాల వినియోగం గురించి మమ్మల్ని టార్గెట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మన సూపర్ స్టార్ మహేశ్ గారు జస్ట్ చైర్ ఫోల్డ్ చేసి డ్యాన్స్ చేశారు అంతేకదా. అందరూ పాజిటివ్‌గా ఆలోచించండి” అని నవ్వుతున్న ఎమోజీస్ పెట్టి వెటకారంగా నిర్మాత నాగవంశీ ట్వీట్ చేశారు.
పెద్ద పండుగ
అదే ట్వీట్‌లో “గుంటూరు కారం కంప్లీట్ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ప్యాకెజ్‌డ్ మూవీ. అన్ని రకాల వర్గాల వారిని అలరిస్తుంది. మాస్‌గా ఉన్నా.. ఫ్యామిలీ, యూత్‌కు కావాల్సిన అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయి. ఫ్యాన్స్, మూవీ లవర్స్ అందరికీ జనవరి 12 పెద్ద పండుగ కానుంది” అని నాగవంశీ చెప్పుకొచ్చారు.
వాయిదా పడుతూ
కాగా గుంటూరు కారం సినిమాకు ఆది నుంచి కష్టాలు తప్పట్లేదు. ఏదో ఒక కారణంతో ఒకరు సినిమా నుంచి తప్పుకుంటే ఇంకెవరో వస్తున్నారు. మూవీ విడుదల కూడా పలుమార్లు వాయిదా పడుతుంది వచ్చిది. చివరిగా వచ్చే సంక్రాంతికి అంటే జనవరి 12న గుంటూరు కారం మూవీని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.