Best Web Hosting Provider In India 2024
West Godavari Crime : పశ్చిమగోదావరి జిల్లాలో ఘరానా మోసాలు చేస్తున్న కిలేడీని పోలీసులు అరెస్టు చేశారు. భీమవరం, నర్సాపురం, పాలకొల్లు, ఆకివీడులలోని జ్యువెలరీ షాపుల్లో కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన ఓ మహిళ మోసాలకు పాల్పడింది. బంగారు పూత వేసిన పాత నగలను మార్చి అసలైన గోల్డ్ నగలను తీసుకున్న ఘటన వెలుగు చూసింది. మహిళ తెచ్చిన నగలను కరిగించగా వాటిల్లో రాగి ఎక్కువగా ఉందని గోల్డ్ షాపు యజమానులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళ చేస్తున్న మోసాలను గురించి, ఆమె ఫొటో, వీడియోలను బంగారం వ్యాపారస్తులు వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశారు. ఈ క్రమంలో ఆకివీడులోని జ్యువెలరీ షాపులో నగలు మార్చడానికి వచ్చిన మహిళను ఆ షాపు యజమాని గుర్తించి, నిర్బంధించారు. అయితే ఆ మహిళ తాను మోసం చేయలేదని వాదిస్తుంది. ఆన్ లైన్ షాపింగ్ లో ఆ నగలు కొన్నట్లు పోలీసులకు రుజువులు చూపిస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ట్రెండింగ్ వార్తలు
నిత్య పెళ్లికూతురు అరెస్ట్
కర్ణాటకలో దావణగెరెలో ఓ మహిళ ధనవంతురాలు కావాలన్న అత్యాశతో నిత్య పెళ్లి కూతురిగా మారింది. ఇందుకోసం ఆ మహిళ నలుగురిని పెళ్లి చేసుకుంది. ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. కర్ణాటకలోని మండ్య జిల్లా పాండవపురకు చెందిన స్నేహకు రెండేళ్ల క్రితం ప్రశాంత్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి ప్రశాంత్ ను పెళ్లి చేసుకుంది. దావణగెరెలో ప్రశాంత్, స్నేహ కాపురం పెట్టారు. ఈ క్రమంలో స్నేహ గర్భందాల్చినట్టు చెప్పి రెండు నెలల క్రితం పుట్టింటింకి వెళ్లింది. ఆ తర్వాత చాలాసార్లు ప్రశాంత్ ఫోన్ చేసి తన వద్దకు రావాలని కోరినా స్నేహ తిరిగి వెళ్లలేదు. దీంతో ప్రశాంత్ తన భార్య కనిపించడం లేదని పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు స్నేహ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి స్నేహ ఆచూకీ కనిపెట్టిన పోలీసులకు షాకింగ్ విషయం తెలిసింది.
నలుగురితో వివాహం
స్నేహకు అప్పటికే నలుగురితో వివాహం జరిగిందని తెలిపింది. ప్రశాంత్ మూడో భర్తని చెప్పడంతో అతను అవాక్కయ్యాడు. ప్రశాంత్ ఇంటి నుంచి వచ్చిన తర్వాత స్నేహ బెంగుళూరుకు చెందిన రఘు అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ప్రశాంత్ కన్నా ముందు వెంకటేశ్ ను, అంతకు ముందు వెంకటేశ్ ను స్నేహ వివాహం చేసుకుంది. ప్రశాంత్ ఫిర్యాదుతో ఈ నిత్య పెళ్లికూతురి గుట్టు రట్టైంది.