Prashanth Neel: సలార్‌ కలెక్షన్లపై ప్రభాస్ రియాక్షన్ ఇదే.. వెల్లడించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్

Best Web Hosting Provider In India 2024

Prashanth Neel: పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన హైవోల్టేజ్ యాక్షన్ సినిమా ‘సలార్’ భారీ కలెక్షన్లతో జోరు చూపిస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ మూవీ అంచనాలను నిజం చేస్తూ భారీ బ్లాక్‍బాస్టర్ దిశగా సాగుతోంది. 8 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా సలార్ చిత్రం రూ.550కోట్లకు పైగా కలెక్ష్లను దక్కించుకొని సత్తాచాటుతోంది. ఈ తరుణంలో సలార్‌కు వస్తున్న రెస్పాన్స్ గురించి ప్రభాస్ ఎలా స్పందించారో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ వెల్లడించారు. ఆ వివరాలు ఇవే.

 

ట్రెండింగ్ వార్తలు

సలార్ మూవీ ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ప్రశాంత్ నీల్. సినిమా రిలీజ్ తర్వాత హీరో ప్రభాస్‍తో మాట్లాడారా అనే ప్రశ్నకు ఆన్సర్ ఇచ్చారు. సలార్‌కు వస్తున్న రెస్పాన్స్ గురించి తాజాగా ప్రభాస్‍తో మాట్లాడానని నీల్ చెప్పారు. సినిమా కలెక్షన్ల గురించి ముచ్చటించినట్టు వెల్లడించారు. ప్రభాస్ చాలా సంతోషించినట్టు తెలిపారు.

“ప్రభాస్ చాలా సంతోషంగా ఉన్నారు. ఆయన రియాక్షన్ చాలా ఉత్సాహకరంగా ఉంది” అని ప్రశాంత్ నీల్ చెప్పారు.

నాకు 100 శాతం సంతృప్తి లేదు

తాను తెరకెక్కించిన చిత్రాలపై తనకు ఎప్పుడూ 100 శాతం సంతృప్తి ఉండదని ప్రశాంత్ నీల్ చెప్పారు. ఇంకా కాస్త మెరుగ్గా ఉండాల్సిందేమోనని అనిపిస్తుందని అన్నారు. తనకే కాదని, ప్రతీ ఫిల్మ్ మేకర్‌కు అలాగే అనిపిస్తుందని చెప్పారు. “ఏ ఫిల్మ్స్ మేకర్ అయినా పూర్తిస్థాయిలో సంతృప్తి చెందరు. అలాగే, నేను కూడా పూర్తిగా సాటిసిఫై కాలేదు. కేజీఎఫ్ 2 విషయంలో కూడా నేను చేసిన దానికి పూర్తిగా సంతృప్తి చెందలేదు” అని ప్రశాంత్ నీల్ వెల్లడించారు. అయితే, ప్రభాస్ పోషించిన దేవా క్యారెక్టర్ విషయంలో తాను చాలా సంతోషంగా ఉన్నానని అన్నారు. సలార్ రెండో పార్ట్ ఇంకా భారీగా ఉంటుందని, ఆ కథ అలాంటిదని నీల్ చెప్పారు.

 

సలార్ సినిమాలో ప్రభాస్ యాక్షన్ సీక్వెన్సులకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ యాక్షన్ సినిమాకు బంపర్ కలెక్షన్లు వస్తున్నాయి. చాలా చోట్ల రికార్డును క్రియేట్ చేస్తోంది. ఇండియాలోనే రూ.310కోట్ల నెట్ కలెక్షన్లను దాటేసింది. ప్రపంచవ్యాప్తంగా లెక్కేసుకుంటే రూ.550 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్కును దాటేసింది. భారీ బ్లాక్‍బాస్టర్ దిశగా దూసుకుపోతోంది. న్యూఇయర్ వస్తుండటంతో కలెక్షన్ల జోరు మరింత పెరుగుతుందనే అంచనాలు ఉన్నాయి.

సలార్ సినిమాలో పృథ్విరాజ్ సుకుమారన్, శృతి హాసన్, ఈశ్వరి రావు, జగపతి బాబు, బాబీ సింహా, టిన్నూ ఆనంద్, శ్రీయా రెడ్డి, దేవరాజ్ కీలకపాత్రలు పోషించారు. హొంబాలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందించారు.

WhatsApp channel
 
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *