Best Web Hosting Provider In India 2024
Hyderabad Biryani : హైదరాబాద్ బిర్యానీ వరల్డ్ ఫేమస్. ఇక దం బిర్యానీ గురించైతే చెప్పక్కర్లేదు. బిర్యానీ అనగానే చాలా మందికి నోట్లో నీళ్లూరుతాయ్. అయితే బిర్యానీ ప్రియులకు షాక్ ఇచ్చే ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. హైదరాబాద్ లో గల్లికో బిర్యానీ సెంటర్ ఉంటుంది. అయితే కొన్ని సార్లు కొంత మంది హోటల్, రెస్టారెంట్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా కస్టమర్స్ ఇబ్బందులు పడుతున్నారు. ఆహారంలో బల్లులు, బొద్దింకలు, పురుగులు ప్రత్యక్షం అవుతున్నాయి. వీటిని గుర్తించకుండా ఆహారం తిన్నవారు ఆసుపత్రుల పాలవుతున్నారు. తాజాగా హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.
ట్రెండింగ్ వార్తలు
8 మందికి అస్వస్థత
రాజేంద్ర నగర్ డైరీ ఫామ్ చౌరస్తాలో ఉన్న డెక్కన్ ఎలైట్ హోటల్ లో 8 మంది కస్టమర్లు బిర్యానీ ఆర్డర్ చేసుకున్నారు. ఆకలిగా ఉన్న వారంతా బిర్యానీ రాగానే త్వరగా తినేశారు. కానీ చివరిలో తమ ప్లేట్ లో ఒక చిన్న తోక కనిపించడంతో……ఒక్కసారిగా కస్టమర్ లు షాక్ అయ్యారు. అప్పటికే అందులో కొంత మందికి అస్వస్థతకు గురై వాంతులు, విరోచనాలు చేసుకున్నారు. వెంటనే బాధితులను మిగతా వారుఅత్తాపూర్ లోని జోయ్ ఆస్పత్రికి తరలించారు.
చాలా హోటల్స్ లో ఇదే పరిస్థితి?
ఎలైట్ హోటల్ యజమానిపై చర్యలు తీసుకోవాలని బాధితులతో పాటు అక్కడి స్థానికులు డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే రాజేంద్ర నగర్ లోని చాలా హోటల్స్, రెస్టారెంట్ లోనూ ఇదే పరిస్థితి ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు వెంటనే అప్రమత్తమై రాజేంద్రనగర్ లోని అన్ని హోటల్లో తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇక జరిగిన ఘటనపై బాధితులు రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్