Best Web Hosting Provider In India 2024
Crispy corn Recipe: రెస్టారెంట్‌కి వెళ్తే క్రిస్పీ కార్న్ ఆర్డర్ చేసే వారి సంఖ్య ఎక్కువే. క్రిస్పీగా ఉండే ఈ కార్న్ రుచిగా ఉంటుంది. పిల్లలకు ఇది ఫేవరెట్ వంటకం అని చెప్పుకోవాలి. అయితే చాలామంది తల్లులు దాన్ని ఇంట్లో చేయలేమని అనుకుంటారు. దీన్ని ఇంట్లో చాలా సులువుగా చేసుకోవచ్చు. క్రిస్పీ కార్న్ రెసిపీ ఎలాగో చూద్దాం.
ట్రెండింగ్ వార్తలు
క్రిస్పీ కార్న్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
స్వీట్ కార్న్ పొత్తులు – రెండు
కార్న్ ఫ్లోర్ – నాలుగు స్పూన్లు
ఉప్పు – రుచికి సరిపడా
నీళ్లు – సరిపడినన్ని
నూనె – వేయించడానికి సరిపడా
మిరియాల పొడి – అర స్పూను
కార్న్ ఫ్లోర్ – నాలుగు స్పూన్లు
వెల్లుల్లి – నాలుగు రెబ్బలు
ఉల్లిపాయ – ఒకటి
మిరియాల పొడి – అర స్పూను
చిల్లీ ఫ్లేక్స్ – అర స్పూను
ఉల్లికాడల తరుగు – రెండు స్పూన్లు
పచ్చిమిర్చి తరుగు – ఒక స్పూను
క్రిస్పీ కార్న్ రెసిపీ
1. స్వీట్ కార్న్‌ను రెండు పొత్తులు తీసుకుంటే క్రిస్పీ కార్న్ చేయడానికి సరిపోతుంది.
2. పొత్తుల నుండి గింజలను వేరు చేయాలి.
3. స్టవ్ మీద కళాయి పెట్టి నీళ్లు వేసి అవి వేడెక్కాక స్వీట్ కార్న్ అందులో వేయాలి. ఇవి 80 శాతం ఉడికిపోవాలి.
4. తర్వాత వాటిని చల్లటి నీళ్లలో వేసి రెండు నిమిషాలు ఉంచాలి.
5. వాటిని తీసి ఒక గిన్నెలో వేయాలి. ఆ గింజల్లో ఉప్పు, మిరియాల పొడి, కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలుపుకోవాలి.
6. అవసరమైతే ఒక స్పూన్ నీళ్లు కూడా వేసుకోవచ్చు.
7. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి వాటిని వేయించడానికి సరిపడా నూనెను వేయాలి.
8. నూనె బాగా వేడెక్కాక ఈ కార్న్ గింజలను వేసి వేయించాలి.
9. అవి చిటపటలాడుతాయి. ఎర్రగా మారాక తీసి పక్కన పెట్టుకోవాలి.
10. ఇప్పుడు స్టవ్ మీద మరో కళాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేయాలి.
11. అందులో పచ్చిమిర్చి తరుగు, ఉల్లిపాయ తరుగు, వెల్లుల్లి తరుగు వేసి ఫ్రై చేయాలి.
12. ముందుగా ఫ్రై చేసుకున్న స్వీట్ కార్న్ గింజలను అందులో వేసి కలపాలి.
13. పైన మిరియాల పొడి, చిల్లీ ఫ్లెక్స్, ఉల్లికాడల తరుగు వేసి కలుపుకోవాలి.
14. అంతే క్రిస్పీ కార్న్ రెడీ అయినట్టే. దీన్ని వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది.
స్వీట్ కార్న్‌లో లుటీన్, జియాక్సంతిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అలాగే బీటా కెరాటిన్ కూడా లభిస్తుంది. ఇది మన కంటి ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఈ మొక్కజొన్న గింజల్లో విటమిన్ బి3, విటమిన్ బి5 అధికంగా ఉంటాయి. ఇవన్నీ కూడా పిల్లలకు, మహిళలకు, గర్భిణీలకు అవసరమైనవి. కాబట్టి స్వీట్ కార్న్ అప్పుడప్పుడు తినడం చాలా ముఖ్యం. దీంట్లో ఉండే ఫోలిక్ యాసిడ్, గర్భిణీలకు, గర్భస్థ శిశువుకు ఆరోగ్యాన్ని అందిస్తుంది. అయితే డయాబెటిస్ ఉన్నవారు మాత్రం దీన్ని తక్కువగా తినాలి. దీనిలో అధికంగా పిండి పదార్థాలు ఉంటాయి. కాబట్టి మోతాదుకు మించి తినకపోవడమే మంచిది.
టాపిక్