Best Web Hosting Provider In India 2024
Guntur Kaaram Kurchi Madathapetti Thatha: సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా గుంటూరు కారం. ఇందులో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల, హిట్ 2 బ్యూటి మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా చేస్తున్నారు. ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
ట్రెండింగ్ వార్తలు
తాజాగా గుంటూరు కారం నుంచి కుర్చీ మడతపెట్టి పాట ప్రోమో విడుదలైంది. డిసెంబర్ 30న సాయంత్రం పూర్తి సాంగ్ రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ పాటపై విపరీతమైన ట్రోలింగ్ వస్తోంది. మహేశ్ బాబు వంటి స్టార్ హీరోకు ఇలాంటి బూతు పదంతో పాట కంపోజ్ చేయడమేంటీ అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు కొంతమంది మహేశ్ బాబు ఫ్యాన్స్ మాత్రం మాస్ బీట్ అదిరిపోయిందని, పాటలో మహేశ్ బాబు, శ్రీలీల డ్యాన్స్ అదరగొట్టారని అంటున్నారు. ఇక సాంగ్ ఎలా ఉందనేది పక్కన పెడితే.. అందులో వాడిన బూతు పదం హైదరాబాద్‌కు చెందిన కాలా పాషాది. అదే కుర్చీ మడతపెట్టి డైలాగ్ సృష్టికర్త. ఓ ఇంటర్వ్యూలో వాళ్ల అత్తారింటికి వెళ్లినప్పుడు వాళ్ల బావమరిదికి చేసిన పనిని కుర్చీ మడతపెట్టి.. అంటూ చెప్పాడు.
దాంతో ఆ వీడియో, ఆ డైలాగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. చాలా మంది రీ క్రియేట్ కూడా చేశారు. ఇప్పుడు ఇదే డైలాగ్‌ను పాటలో వాడాడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. అయితే ఆ డైలాగ్‌ను ఊరికే వాడలేదట. కుర్చీ తాతకు ఆర్థిక సహాయం (రెమ్యునరేషన్) చేసి మరి ఆ డైలాగ్ కొన్నాడని తెలుస్తోంది.
కుర్చీ మడతపెట్టి పాటలో ఆ పదం వాడకున్నందుకు కాలా పాషాకు సుమారు రూ. 5 వేలు తమన్ ఇచ్చాడని సమాచారం. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో కుర్చీ తాత కాలా పాషా చెప్పాడు. అలాగే తన మాట మహేశ్ బాబు పాటలో వాడటం సంతోషంగా ఉందని చెప్పడమే కాకుండా అవకాశం ఇస్తే ఒక చరణానికి డ్యాన్స్ చేయాలని ఉందని మనసులో మాట తెలిపాడు కుర్చీ తాత.