YSRCP Nandigama :
ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
ది.07-10-2022(శుక్రవారం) ..
బడుగు, బలహీన వర్గాలకు అండగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ..
పట్టణంలోని 14 వ వార్డులో “గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమం”లో భాగంగా సంక్షేమ పథకాలను వివరిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
నందిగామ పట్టణంలోని 14 వ వార్డు పరిధిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ – ప్రజల సమస్యలను శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు అడిగి తెలుసుకున్నారు ..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ ,బీసీ ,మైనారిటీల జీవితాలలో వెలుగులు తెచ్చేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తున్నారని , ఎస్టి ఎస్సీ బీసీలను రాజ్యాధికారంలో భాగం చేస్తూ మంత్రివర్గ విస్తరణలో కూడా వారికి పెద్దపీట వేశారని , వారికి మంత్రులుగా అవకాశం కల్పించడమే కాకుండా -ఉపముఖ్యమంత్రులుగా కూడా అవకాశం కల్పించిన ఘనత వైయస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు , నామినేటెడ్ పదవుల్లో సైతం బడుగు బలహీన వర్గాలకు అవకాశం కల్పిస్తున్నారని , సంక్షేమ పథకాలతో పేద మహిళల జీవితాల్లో భరోసా ఏర్పడిందని – గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఏ ఇంటికి వెళ్లిన మహిళలంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మద్దతుగా మాట్లాడడమే కాకుండా ,మళ్లీ ముఖ్యమంత్రిగా ఆయనే ఉండాలని ,మహిళలంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు అండగా ఉంటామని తెలిపారని చెప్పారు ,
ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్ ,కౌన్సిల్ సభ్యులు ,కోఆప్షన్ సభ్యులు ,ఏఈ ,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ,సచివాలయ సిబ్బంది , వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు ..
YSRCP Nandigama : శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ని దర్శించుకున్న..
Follow us : Facebook ,Instagram ,Twitter