YSRCP Nandigama :
ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
దివ్యాంగుడు వేల్పుల నాగేశ్వరరావు కు మూడు చక్రాల సైకిల్ అందజేసిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
నందిగామ మండలంలోని అడవిరావులపాడు గ్రామానికి చెందిన దివ్యాంగుడు వేల్పుల నాగేశ్వరరావు గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా తన నివాసానికి విచ్చేసిన శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారికి మూడు చక్రాల సైకిల్ కావాలని విజ్ఞప్తి చేసిన పిమ్మట తదుపరి రోజే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతుల -వయోవృద్ధుల సహాయ సంస్థ నుంచి ట్రై సైకిల్ ను శుక్రవారం నందిగామ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఆయనకు ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారి చేతుల మీదగా మూడు చక్రాల సైకిల్ అందజేయడం జరిగింది ..
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో , పంచాయతీరాజ్ ఏఈ , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..