ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
ది.10-10-2022(సోమవారం) ..
నవరత్నాలతో ప్రజల జీవితాల్లో వెలుగులు ..
పట్టణంలోని 13 వ వార్డులో “గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమం” నిర్వహించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
నందిగామ పట్టణంలోని 13 వ వార్డు లో సోమవారం ఉదయం “గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం”లో భాగంగా శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ప్రతి ఇంటికీ తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను -పనితీరును వివరించారు ,
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జన సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలలో మంచి పేరు తెచ్చుకున్నారని ,లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని సమర్థవంతంగా నడిపిస్తూ అభివృద్ధి -సంక్షేమం రెండు కళ్లుగా పరిపాలన చేస్తూ దేశంలోనే ఆదర్శ ముఖ్యమంత్రిగా స్థానం సంపాదించారని తెలిపారు , గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రజాప్రతినిధులను -అధికారులను ఏకం చేసి ప్రజల్లోకి వెళ్లి సమస్యలు తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కరించే విధంగా గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమాన్ని రూపొందించారని తెలిపారు , అధికారులంతా వార్డుల్లోకి వచ్చి ప్రజల ఇళ్ళ ముందు నుంచుని పరిపాలన చేస్తున్న విధానానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున అభినందనలు వస్తున్నాయన్నారు , అనంతరం సచివాలయ సిబ్బంది -వాలంటీర్ల పనితీరుపై గ్రామస్తులను ఆరా తీశారు ..
ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్, ఏఈ, కౌన్సిల్ సభ్యులు, కో ఆప్షన్ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వాలంటీర్లు ,సచివాలయ సిబ్బంది ,పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు ..
#ysrcp_nandigama
#mla_nandigama
#jagan_mohan_rao_monditoka
#mlc_nandigama
#arun_kumar_monditoka