
Best Web Hosting Provider In India 2024

Tamannaah: తమన్నా దటీజ్ మహాలక్ష్మి మూవీ థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయి ఎనిమిది ఏళ్లు అవుతోంది. కానీ అనివార్య కారణాల వల్ల ఇప్పటివరకు ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీ రిలీజ్ కాలేదు.
ట్రెండింగ్ వార్తలు
నేషనల్ అవార్డును దక్కించుకున్న కంగన రనౌత్ బాలీవుడ్ మూవీ క్వీన్ ఆధారంగా దటీజ్ మహాలక్ష్మి మూవీని 2014లోఅఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. 2016లో షూటింగ్ కంప్లీట్ చేశారు. దటీజ్ మహాలక్ష్మి సినిమాకు హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాడు. సౌత్ రీమేక్ రైట్స్ విషయంలో నెలకొన్న వివాదం కారణంగా షూటింగ్ పూర్తయినా దటీజ్ మహాలక్ష్మి మూవీ ఇప్పటివరకు విడుదలకు నోచుకోలేదు.
రిలీజ్ విషయంలో గ్యాప్ మరీ ఎక్కువ రావడంతో ఈ సినిమాను తమన్నా, ప్రశాంత్ వర్మతో పాటు అభిమానులుకూడా మార్చిపోయారు. ప్రస్తుతం ఓటీటీలకు ఉన్న ఆదరణను దృష్టిలో పెట్టుకొని దటీజ్ మహాలక్ష్మి మూవీని డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలిసింది. నెట్‌ఫ్లిక్స్ తో నిర్మాతలు సంప్రదింపులు జరుగుతున్నట్లు తెలిసింది.
త్వరలోనే దటీజ్ మహాలక్ష్మి ఓటీటీ రిలీజ్ డేట్‌పై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. దటీజ్ మహాలక్ష్మి మూవీలో సిద్దు జొన్నలగడ్డ కీలక పాత్ర పోషించాడు.