Upcoming Web Series in 2024: ఆ టాప్ వెబ్ సిరీస్ అన్నీ 2024లోనే వచ్చేస్తున్నాయ్.. సిద్ధంగా ఉండండి

Best Web Hosting Provider In India 2024

Upcoming Web Series in 2024: కొన్నేళ్లుగా ఓటీటీల్లో వచ్చిన వెబ్ సిరీస్‌ల కొత్త సీజన్లు ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. వీటిలో ముఖ్యంగా 8 వెబ్ సిరీస్ ఎంతో ఆసక్తి రేపుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

ప్రైమ్ వీడియోలో వచ్చిన మీర్జాపూర్, ది ఫ్యామిలీ మ్యాన్, పంచాయత్ లాంటి సిరీస్‌లతోపాటు నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన ఢిల్లీ క్రైమ్, ఎంఎక్స్ ప్లేయర్ లో వచ్చిన ఆశ్రమ్ కొత్త సీజన్లు 2024లో ప్రేక్షకులను పలుకరించనున్నాయి.

2024లో రానున్న వెబ్ సిరీస్ ఇవే

పంచాయత్ సీజన్ 3 – ప్రైమ్ వీడియో

ఇప్పటికే రెండు సీజన్లపాటు నవ్వించి, ఏడిపించి, ఆలోచింపజేసిన సిరీస్ పంచాయత్. ఓ గ్రామానికి ఇష్టం లేకుండా పంచాయతీ సెక్రటరీగా వచ్చిన వ్యక్తి.. ఆ తర్వాత అక్కడి ప్రజలతో మమేకమైపోయి ఆ ఊరు విడిచి పోలేకపోతాడు. మొదట్లో అతన్ని ఇష్టపడని గ్రామస్థులు కూడా తర్వాత అక్కున చేర్చుకుంటారు. ప్రైమ్ వీడియోలో ఈ వెబ్ సిరీస్ మూడో సీజన్ ఈ ఏడాది సమ్మర్ లో వచ్చే అవకాశం ఉంది.

మీర్జాపూర్ సీజన్ 3 – ప్రైమ్ వీడియో

ప్రైమ్ వీడియోలో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మీర్జాపూర్ కు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ సిరీస్ మూడో సీజన్ ఈ ఏడాది మార్చిలో వచ్చే అవకాశం ఉంది. కాలీన్ భయ్యా తప్పించుకొని పోవడం, గుడ్డూ భయ్యా మీర్జాపూర్ సింహాసనంపై కూర్చోవడంతో ముగిసిన రెండో సీజన్.. మూడో సీజన్ పై ఎంతో ఆసక్తి రేపుతోంది.

ఇండియన్ పోలీస్ ఫోర్స్ – ప్రైమ్ వీడియో

బాలీవుడ్ స్టార్లు సిద్ధార్థ్ మల్హోత్రా, శిల్పా శెట్టి, వివేక్ ఒబెరాయ్ నటించిన వెబ్ సిరీస్ ఇండియన్ పోలీస్ ఫోర్స్. ప్రైమ్ వీడియోలో జనవరి 19న ఈ కొత్త సిరీస్ రిలీజ్ కానుంది. ఇప్పటికే వచ్చిన ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి ఈ షోని క్రియేట్ చేశాడు.

ఆశ్రమ్ సీజన్ 4 – ఎంఎక్స్ ప్లేయర్

ఎంఎక్స్ ప్లేయర్ ఓటీటీలో పెద్దగా అంచనాలు లేకుండా వచ్చి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న సిరీస్ ఆశ్రమ్. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్.. బాబా నిరాలాగా కనిపించిన ఈ వెబ్ సిరీస్ మూడు సీజన్లు పూర్తయ్యాయి. ఈ ఏడాది నాలుగో సీజన్ రానుంది.

ఆశ్రమం పేరుతో అక్కడి బాబా మహిళలపై పాల్పడుతున్న ఆకృత్యాలను ప్రపంచానికి తెలియజెప్పేందుకు ప్రయత్నించే ఓ అమ్మాయి చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. కాస్త అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఈ సిరీస్ నాలుగో సీజన్ రిలీజ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు.

ఢిల్లీ క్రైమ్ సీజన్ 3 – నెట్‌ఫ్లిక్స్

ఢిల్లీ క్రైమ్ పేరుతో నెట్‌ఫ్లిక్స్ లో వచ్చిన తొలి రెండు సీజన్లు బాగా ఆకట్టుకున్నాయి. నిర్భయ ఘటనపై తొలి సీజన్, కచ్చా బనియన్ గ్యాంగ్ పై రెండో సీజన్ రూపొందాయి. ఈ ఏడాది మూడో సీజన్ రానుంది. అయితే నెట్‌ఫ్లిక్స్ ఇంకా డేట్ వెల్లడించలేదు.

ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 – ప్రైమ్ వీడియో

ప్రముఖ బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయీ నటించిన ఫ్యామిలీ మ్యాన్ తొలి రెండు సీజన్లు మంచి థ్రిల్ అందించాయి. ముఖ్యంగా రెండో సీజన్లో సమంత కూడా కనిపించి అలరించింది. మూడో సీజన్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ సీజన్ కరోనా వైరస్ సీక్రెట్ చుట్టూ తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది చివర్లో సీజన్ 3 వచ్చే అవకాశం ఉంది

ఫర్జీ సీజన్ 2 – ప్రైమ్ వీడియో

2023లో బెస్ట్ వెబ్ సిరీస్ గా నిలిచిన ఫర్జీ రెండో సీజన్ ఈ ఏడాది రానుంది. బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్, కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి పోటీ పడి నటించిన ఈ సిరీస్ ను తెలుగు దర్శకులు రాజ్ అండ్ డీకే రూపొందించారు. ఓ ఆర్టిస్ట్ నకిలీ నోట్లు ముద్రించే పెద్ద మాఫియాగా ఎలా మారాడన్నది ఈ సిరీస్ లో చూడొచ్చు. 2024 చివర్లో రెండో సీజన్ రానుంది.

షి సీజన్ 3 – నెట్‌ఫ్లిక్స్

విజయ్ వర్మ నటించిన ఈ షి వెబ్ సిరీస్ రెండు సీజన్లు పూర్తి చేసుకుంది. ఓ ఆపరేషన్ లో భాగంగా ఓ పెద్ద నేరస్థుడిని పట్టుకోవడానికి వేశ్యగా మారిన పోలీస్ కానిస్టేబుల్.. తర్వాత అదే నేర సామ్రాజ్యంలో ఎలా భాగమైందన్నది ఈ షి వెబ్ సిరీస్ లో చూడొచ్చు. మూడో సీజన్ ఈ ఏడాది రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *