Best Web Hosting Provider In India 2024
Jr NTR Tweet: వరుస భూకంపాలతో వణికిపోయిన జపాన్ నుంచి టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ క్షేమంగా బయటపడ్డాడు. తాను తిరికి ఇంటికి చేరుకున్నట్లు సోమవారం (జనవరి 1) అర్ధరాత్రి దాటిన తర్వాత తారక్ ట్వీట్ చేశాడు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం వారం కిందట అతడు జపాన్ కు వెళ్లిన విషయం తెలిసిందే.
ట్రెండింగ్ వార్తలు
అయితే కొత్త ఏడాది మొదటి రోజైన సోమవారం (జనవరి 1) ఏకంగా 155 భూకంపాలు జపాన్ ను వణికించాయి. ఇందులో ఆరుగురు చనిపోయారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ క్షేమ సమాచారం కోసం అభిమానులు తెగ ప్రయత్నించారు. చివరికి తాను క్షేమంగా తిరిగి వచ్చినట్లు అతడే సోషల్ మీడియా ద్వారా వెల్లడించడంతో ఫ్యాన్స్ అంతా ఊపిరి పీల్చుకున్నారు.
“జపాన్ నుంచి ఇవాళే ఇంటికి తిరిగి వచ్చేశాను. అక్కడి భూకంపాల వార్తలు చూసి షాక్ తిన్నాను. గత వారం రోజులు అక్కడే గడిపాను. భూకంపాల వల్ల ప్రభావితమైన అందరికీ నా ప్రగాఢ సానుభూతి. ఇలాంటి పరిస్థితుల్లోనూ అక్కడి ప్రజలు ఎంతో దృఢంగా ఉన్నారు. వాళ్లు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను” అని తారక్ ట్వీట్ చేశాడు.
తమ అభిమాన హీరో క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చాడన్న సమాచారంతో ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు. తారక్ చేసిన ట్వీట్ ను వేల మంది రీట్వీట్స్ చేస్తున్నారు. మరోవైపు న్యూఇయర్ సందర్భంగా తారక్ నెక్ట్స్ మూవీ దేవర నుంచి ఓ సర్‌ప్రైజ్ పోస్టర్ కూడా రిలీజైన విషయం తెలిసిందే. ఈ మూవీ నుంచి గ్లింప్స్ జనవరి 8న రిలీజ్ చేయబోతున్నట్లు ఈ పోస్టర్ ద్వారా మేకర్స్ వెల్లడించారు.
ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత మరో తారక్ సినిమా కోసం ఫ్యాన్స్ సుమారు రెండేళ్లుగా ఎదురు చూస్తున్నారు. అయితే దేవర మూవీ ఆలస్యమవుతూ వచ్చింది. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతోంది. దేవర నుంచి ఇప్పటికే వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్లు ఆసక్తి రేపుతున్నాయి. తారక్ తోపాటు విలన్ సైఫ్ అలీ ఖాన్, ఫిమేల్ లీడ్ జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజైన విషయం తెలిసిందే.