Water Heater Mistakes : నీటిని వేడి చేసేందుకు వాటర్ హీటర్ వాడుతున్నారా? ఈ తప్పులు చేయకండి

Best Web Hosting Provider In India 2024

శీతాకాలంలో ఉన్నాం. చలి విపరీతంగా పెరిగింది. చలికాలంలో చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేస్తుంటారు. ఇంట్లో స్నానం చేయడానికి నీటిని వేడి చేయడానికి గీజర్లు, వాటర్ హీటర్ రాడ్లను ఉపయోగిస్తారు. పట్టణాల్లోనే కాదు.. పల్లెటూర్లలోనూ వీటి వాడకం ఎక్కువైంది. ఈ పరికరాలతో నీటిని వేడి చేయడం సులభం అయినప్పటికీ, దీనికి చాలా జాగ్రత్త అవసరం. విద్యుదాఘాతం కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయే వార్తలు తరచూ చూస్తునే ఉంటాం. దీనిని నివారించడానికి వాటర్ హీటర్ రాడ్‌లతో నీటిని వేడి చేసేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి.

ట్రెండింగ్ వార్తలు

వాటర్ హీటర్ రాడ్‌తో నీటిని వేడి చేసేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం. చిన్న పొరపాటు పెద్ద ప్రమాదానికి దారి తీస్తుంది.

మీరు నీటిని వేడి చేసినప్పుడు, నీటి ఉష్ణోగ్రతను చెక్ చేయడానికి స్విచ్ ఆఫ్ చేయండి. స్విచ్ ఆన్‌లో ఉన్నప్పుడు నీటిని తాకవద్దు. కరెంట్ షాక్ వచ్చే ప్రమాదం ఉంది. ఇలా చాలా మంది ప్రాణాలు కోల్పోయినవారు ఉన్నారు.

ఉపయోగించిన తర్వాత ఎల్లప్పుడూ రాడ్‌ను మూసివేయండి. మీరు దానిని వదిలివేయడం ప్రమాదకరం. అలానే చేసి స్విచ్ ఆఫ్ చేయడం మరిచిపోతే చాలా డేంజర్. రాడ్ నుండి విద్యుత్ షాక్‌ను నివారించడానికి దానిని స్విచ్ బోర్డ్ నుంచి తీసేయాలి.

నీటిని వేడి చేసేప్పుడు స్విచ్ ఆఫ్ చేసిన 10 సెకన్ల తర్వాత రాడ్‌ను నీటిలో నుండి బయటకు తీయండి. ఆఫ్ చేశాం కదా అని వెంటనే తీసి బయట పెట్టవద్దు.

ఇనుము లేదా స్టీల్ బకెట్‌లో నీటిని ఎప్పుడూ వేడి చేయవద్దు. ఇది తీవ్రమైన విద్యుత్ షాక్‌కు కారణం కావచ్చు. వాటర్ హీటర్‌తో ఇలా చేస్తే చాలా ప్రమాదాలు చూడాల్సి వస్తుంది.

నీటిని వేడి చేయడానికి ప్లాస్టిక్ బకెట్లను ఉపయోగించండి. అయితే బకెట్ కరిగిపోకుండా నిరోధించడానికి, దానిని చెక్క కర్రకు జోడించడం ద్వారా మాత్రమే ఉపయోగించండి.

వాటర్ హీటింగ్ రాడ్ ఉపయోగించినప్పుడు.. నీటిలోకి ఎంత పంపాలో దానిపై గుర్తు ఉంటుంది. గుర్తుకు చేరుకునే వరకు నీటిలో ముంచండి. నాణ్యత లేని రాడ్లను ఉపయోగించడం మానుకోండి.

పాత వాటర్ హీటర్ రాడ్లను ఉపయోగించడం మానుకోండి. నీటిలోని ఉప్పు వాటర్ హీటర్‌కు పట్టుకుని ఉంటుంది. అందుకే కొన్ని రోజులు వాడిన తర్వాత క్లీన్ చేస్తే.. త్వరగా నీరు వేడి అవుతుంది.

చాలా సార్లు రాడ్ మంచి స్థితిలో ఉంది కదా అని సంవత్సరాల తరబడి ఉపయోగిస్తారు. కానీ కొన్ని అంతర్గత లోపం వల్ల అది విద్యుత్ షాక్‌కు కారణం కావచ్చు. మీరు రెండు సంవత్సరాల కంటే ఎక్కువ వాటర్ హీటర్ ఉపయోగించకూడదు. దానిని ఉపయోగించే ముందు ఎలక్ట్రీషియన్‌తో చెక్ చేయించండి.

WhatsApp channel
Source / Credits

Best Web Hosting Provider In India 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *