Best Web Hosting Provider In India 2024
Kesineni Nani: నీతి, నిజాయితీ, నిస్వార్ధంగా సేవ చేయటం కోసం మాత్రమే రాజకీయాల్లోకి రావాలని, డబ్బు సంపాదన కోసం కాదని విజయవాడ ఎంపీ కేశినేని నాని చెప్పారు. విజయవాడ పార్లమెంటు అభ్యర్థిగా బీసీని ప్రకటిస్తే మద్దతిస్తానని గత వారం ప్రకటించిన కేశినేని నాని తాజాగా విజయవాడ పశ్చిమ నియోజక వర్గంలో నిజాయితీపరులకే మద్దతిస్తానని చెప్పారు.
ట్రెండింగ్ వార్తలు
విజయవాడ టీడీపీ నాయకులతో ఎంపీ కేశినేని నానికి తీవ్ర స్థాయిలో విభేదాలు ఉన్నాయి. సోదరుడు కేశినేని చిన్నితో పాటు బుద్దా వెంకన్న, నాగుల్‌మీరా, బొండా ఉమా తదితరులతో విభేదాలు ఉన్నాయి
ఈ నేపథ్యంలో కేశినేని కుమార్తెను ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తారని ప్రచారం జరిగింది. విజయవాడ పశ్చిమ నియోజక వర్గం నుంచి తన కుమార్తె శ్వేత పోటీ చేస్తుందన్న ప్రచారం జరుగుతోందని, విజయవాడ పశ్చిమ నియోజక వర్గం నుంచి తాను, కుమార్తె శ్వేతతో పాటు ఇతర కుటుంబ సభ్యులు ఎవరు పోటీ చేయరన్నారు.
నీతి నిజాయితిపరులే రాజకీయాల్లోకి రావాలని, సంపాదన కోసం కొంతమంది రాజకీయాల్లోకి రావడం ఫ్యాషన్‌గా మారిందని విమర్శించారు. దోచుకోను.. ఇంకొకరిని దోచుకోనివ్వనని.. అందుకే అక్రమార్కులు తనపై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
2019లో M.S బేగ్ తెలుగుదేశం పార్టీలో చేరారని M.S బేగ్‌ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే చంద్రబాబు వద్దకు తీసుకు వెళ్లానని చెప్పారు. తెలుగుదేశం పార్టీలో మరో 25- 30 ఏళ్లు నిజాయితీ గల మంచి ముస్లిం నాయకుడు ఉండాలని M.S బెగ్ కి పశ్చిమ నియోజకవర్గంలో మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు.
విజయవాడలో అవినీతి, అక్రమార్కులను సహించేది లేదని వారితో పోరాడేందుకు సిద్ధంగా ఉన్నానని కేశినేని నాని ప్రకటించారు. కొందరి కబంధ హస్తాల నుంచి వెస్ట్ నియోజకవర్గాన్ని కాపాడేందుకే బాధ్యత తీసుకున్నానని చెప్పారు. పశ్చిమ నియోజకవర్గ ఓటర్లు మంచి వ్యక్తిని ఎన్నుకుంటారని చెప్పారు.
విజయవాడ ఎంపీగా రెండుసార్లు గెలిచిన కేశినేని నానికి పోటీగా నాని సోదరుడు చిన్ని కొద్ది రోజులుగా ప్రయత్నిస్తున్నారు. టీడీపీ పెద్దలు కూాడా అతడిని ప్రోత్సహిస్తున్నారనే భావనతో కేశినేని నాని పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్టైన సమయంలో ఆ దూరం తగ్గిపోయిందని, లోకేష్‌కు అన్ని విషయాలు అవగతం అయ్యాయని కేశినేని నాని వర్గం చెబుతోంది.