Best Web Hosting Provider In India 2024
Bubblegum Movie Collection: రోషన్ కనకాల బబుల్ గమ్ మూవీ డిజాస్టర్ దిశగా సాగుతోంది. నాలుగు రోజుల్లో ఈ మూవీ కోటి కలెక్షన్స్ కూడా రాబట్టలేకపోయింది. తొలిరోజు యాభై లక్షల వసూళ్లను రాబట్టిన ఈ మూవీ నెగెటివ్ టాక్ కారణంగా తర్వాత రోజు నుంచి బాక్సాఫీస్ వద్ద డీలా పడింది. రెండు రోజు నలభై ఐదు లక్షలు, మూడో రోజు యాభై రెండు లక్షల వసూళ్లు మాత్రమే వచ్చాయి.
ట్రెండింగ్ వార్తలు
సోమవారం హాలీడే రోజు కూడా ఈ మూవీ డిసపాయింట్ చేసింది. కేవలం 47 లక్షల వసూళ్లను మాత్రమే రాబట్టింది. మొత్తంగా నాలుగు రోజుల్లో కోటి తొంభై లక్షల గ్రాస్, తొంభై లక్షలకు పైగా షేర్‌ను బబుల్‌గమ్ మూవీ రాబట్టింది. మంగళవారం రోజు వసూళ్లు మరింత తగ్గనున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా డైరెక్టర్ రవికాంత్ పేరేపు బబుల్ గమ్ మూవీని తెరకెక్కించాడు. కథ, కథనాల్లో కొత్తదనం లేకపోవడంతో, ఈ పాయింట్‌తో గతంలో తెలుగులో చాలా సినిమాలు రావడంతో బబుల్‌గమ్ ఫస్ట్ డే నుంచే నెగెటివ్ టాక్‌ను మూటగట్టుకున్నది.
దాదాపు నాలుగు కోట్ల బడ్జెట్‌తో బబుల్ గమ్ మూవీ తెరకెక్కింది. అటు ఇటుగా థియేట్రికల్ రన్‌లో ఈ మూవీ కోటిన్నర వరకు వసూళ్లను రాబట్టే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
నిర్మాతలకు ఈ మూవీ భారీగానే నష్టాలు మిగిల్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. బబుల్‌గమ్ మూవీలో మానస చౌదరి హీరోయిన్‌గా నటించింది. క్షణం, కృష్ణ అండ్ ఈజ్ లీలా సినిమాల తర్వాత రవికాంత్ పేరేపు దర్శకత్వం వహించిన మూవీ ఇది.