Best Web Hosting Provider In India 2024
Dunki 12 days box office collections: బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ నటించిన డంకీ మూవీ న్యూ ఇయర్ అయిన సోమవారం (జనవరి 1) రోజు రూ.9.25 కోట్లు మాత్రమే వసూలు చేసింది. గతేడాది రెండు వెయ్యి కోట్ల సినిమాలు అందించిన షారుక్.. హ్యాట్రిక్ సాధిస్తాడనుకుంటే డంకీ మాత్రం నెగటివ్ టాక్ తో ఊహించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయింది.
ట్రెండింగ్ వార్తలు
హిందీ బెల్ట్‌లో ప్రభాస్ సలార్ కంటే డంకీదే పైచేయి అయినా.. సౌత్‌లో అందులోనూ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సలార్ బాక్సాఫీస్ దగ్గర విధ్వంసం సృష్టించింది. సలార్ పాన్ ఇండియా లెవల్లో ఐదు భాషల్లో రిలీజ్ కావడం కలిసి వచ్చింది. మరోవైపు డంకీ మాత్రం కేవలం హిందీలోనే రిలీజైంది. ఉత్తరాది రాష్ట్రాల్లో సలార్ కంటే డంకీనే ఎక్కువగా ఆదరించారు.
సలార్ 11 రోజుల్లో హిందీ వెర్షన్ లో రూ.123 కోట్లు వసూలు చేయగా.. డంకీ రూ.196 కోట్లు వసూలు చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే.. డంకీ రూ.370.25 కోట్లు వసూలు చేయగా.. త్వరలోనే రూ.400 కోట్లు దాటనుంది. గతేడాది పఠాన్, జవాన్ లతో రెండు వెయ్యి కోట్ల సినిమాలు అందించిన షారుక్ ఖాన్‌కు డంకీ మాత్రం అనుకున్న ఫలితం ఇవ్వలేకపోయింది.
రాజ్‌కుమార్ హిరానీ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ప్రేక్షకులకు పెద్దగా రుచించలేదు. లండన్ వెళ్లాలని కలలు కంటూ వీసాలు రాకపోవడంతో అక్రమంగా ఆ దేశంలోకి వెళ్లి ఇబ్బందులు పడే నలుగురు స్నేహితుల చుట్టూ తిరిగే కథే ఈ డంకీ మూవీ. ఇందులో హార్డీ అనే పాత్రలో షారుక్ నటించాడు. తాప్సీ, విక్కీ కౌశల్ ముఖ్యమైన పాత్రలు పోషించారు.