Best Web Hosting Provider In India 2024
12th Fail OTT: బాలీవుడ్‍లో చిన్న చిత్రంగా వచ్చిన ‘12th ఫెయిల్’ (ట్వెల్త్ ఫెయిల్) సినిమా హిట్ సాధించింది. కలెక్షన్లతో పాటు చాలా ప్రశంసలు దక్కించుకుంది. చాలా మందిలో స్ఫూర్తిని నింపిన మంచి చిత్రంగా పేరు తెచ్చుకుంది. పేదరికాన్ని దాటి, ఓ దశలో 12వ తరగతి ఫెయిల్ అయినా ఆ తర్వాత కష్టపడి చదివి ఐపీఎస్ ఆఫీసర్ అయిన మనోజ్ కుమార్ శర్మ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు విధు వినోద్ చోప్రా. గతేడాది (2023) అక్టోబర్ 27న హిందీలో 12th ఫెయిల్ రిలీజ్ అయింది. అక్కడ మంచి రెస్పాన్స్ రావటంతో తెలుగు, కన్నడ, తమిళం భాషల్లో నవంబర్ 3వ తేదీన థియేటర్లలోకి వచ్చింది. తెలుగులోనూ ఈ చిత్రం అంచనాలకు తగ్గట్టుగా ఆడింది. అయితే, ఇటీవలే 12th ఫెయిల్ సినిమా ఓటీటీలోకి స్ట్రీమింగ్‍కు వచ్చింది.
ట్రెండింగ్ వార్తలు
12th ఫెయిల్ సినిమా డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో గత వారం డిసెంబర్ 29న స్ట్రీమింగ్‍కు వచ్చింది. హిందీలో మాత్రమే ఈ మూవీ స్ట్రీమింగ్‍కు అందుబాటులో వచ్చింది. ఓటీటీలోకి 12th ఫెయిల్ మూవీకి అదిరిపోయే స్పందన వస్తోంది. హాట్‍స్టార్ ట్రెండింగ్‍లో ప్రస్తుతం టాప్‍లో ఉంది. చాలా మంది ఈ మూవీని చూసి సోషల్ మీడియాలో ప్రశంసిస్తున్నారు. ఈ తరుణంలో 12th మూవీ తెలుగు, కన్నడ భాషల డబ్బింగ్ వెర్షన్‍ను కూడా స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి తీసుకురావాలని నెటిజన్లు డిమాండ్లు చేస్తున్నారు.
12th ఫెయిల్ సినిమా తెలుగు, తమిళం, కన్నడ వెర్షన్లు థియేటర్లలో కూడా రిలీజ్ అయింది. అయితే, హాట్‍స్టార్‌లో ప్రస్తుతం హిందీలో మాత్రం ఉంది. దీంతో, తెలుగు, కన్నడ, తమిళ వెర్షన్‍లను తీసుకురావాలని కొందరు నెటిజన్లు హాట్‍స్టార్ ప్లాట్‍ఫామ్‍ను డిమాండ్ చేస్తున్నారు. కనీసం అప్‍డేట్ అయినా త్వరగా ఇవ్వాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరి ప్రాంతీయ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు ఎప్పుడొస్తుందో చూడాలి.
12th పెయిల్ చిత్రంలో విక్రాంత్ మాసే.. మనోజ్ కుమార్ శర్మ పాత్ర పోషించారు. మేధా శంకర్, అనంత్ వీ జోషి, అయుష్మాన్ పుష్కర్, ప్రియాన్షు చటర్జీ, గీతా అగర్వాల్ శర్మ, హరిశ్ ఖన్నా కీరోల్స్ చేశారు. ఈ స్ఫూర్తిదాయకమైన బయోపిక్ స్టోరీని దర్శకుడు విధు వినోద్ చోప్రా తెరకెక్కించిన విధానం ఆకట్టుకుంది. విక్రాంత్ నటన కూడా హైలైట్‍గా నిలిచింది.
పేదరికం.. 12వ తరగతిలో ఫెయిల్.. ఎన్నో ఇబ్బందులు.. వీటన్నింటినీ దాటుకొని ఎంతో కష్టపడి యూపీఎస్‍సీ పరీక్షలో ఉత్తీర్ణులై ఐపీఎస్ ఆఫీసర్ అయ్యారు మనోజ్ కుమార్ శర్మ. ఈయన జీవితం ఆధారంగానే ఈ 12th ఫెయిల్ మూవీ తెరకెక్కింది.