Best Web Hosting Provider In India 2024
Devil 4 days Box Office Collections: డెవిల్ మూవీపై భారీ ఆశలు పెట్టుకున్న నందమూరి కల్యాణ్ రామ్ కు నిరాశ తప్పేలా కనిపించడం లేదు. ఈ మూవీ మొదటి వీకెండ్ కలెక్షన్లు అంతంతమాత్రంగా ఉండటంతో బ్రేక్ ఈవెన్ సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. అయితే న్యూ ఇయర్ రోజు మాత్రం డెవిల్ మూవీ తన బెస్ట్ కలెక్షన్లు సాధించింది.
ట్రెండింగ్ వార్తలు
గత శుక్రవారం (డిసెంబర్ 29) రిలీజైన డెవిల్ మూవీ నాలుగో రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.3.25 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇది తొలి రోజు కంటే కూడా ఎక్కువ కావడం విశేషం. డెవిల్ మూవీ తొలి రోజు రూ.3.1 కోట్ల ఓపెనింగ్ సాధించింది. అయితే రెండు, మూడు రోజుల్లో వసూళ్లు తగ్గుతూ వచ్చాయి. రెండో రోజైన శనివారం రూ.2.65 కోట్లు, మూడో రోజు రూ.2.5 కోట్లు మాత్రమే వసూలు చేసింది.
నాలుగో రోజు అయిన న్యూ ఇయర్ డే డెవిల్ మూవీకి కాస్త కలిసి వచ్చింది. దీంతో ఇప్పటి వరకూ నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.15.5 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇందులో షేర్ కేవలం రూ.7.5 కోట్లు మాత్రమే. రిలీజ్ కు ముందు డెవిల్ ఏకంగా రూ.20 కోట్ల బిజినెస్ చేసింది. ఆ లెక్కన డెవిల్ బ్రేక్ ఈవెన్ సాధించడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది.
హాలీడే సీజన్ ముగియడంతో మంగళవారం (జనవరి 2) నుంచి డెవిల్ కలెక్షన్లు పడిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రెండో వీకెండ్ సమయానికి డెవిల్ అసలు ఎన్ని స్క్రీన్లలో ఉంటుందో కూడా తెలియదు. ఆ తర్వాత వారం సంక్రాంతి సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. దీంతో డెవిల్ కు నిరాశ తప్పేలా లేదు. బింబిసారలాంటి సూపర్ హిట్ మూవీ తర్వాత అమిగోస్ ఫ్లాపయింది.
డెవిల్ తో మళ్లీ గాడిలో పడాలనుకున్న కల్యాణ్ రామ్ ఆశలు తీరేలా లేవు. ఈ మూవీని అభిషేక్ నామా నిర్మించి, డైరెక్ట్ చేశాడు. నిజానికి నవీన్ మేడారం చాలా వరకూ సినిమాను చిత్రీకరించినా.. తర్వాత ప్రొడ్యూసర్ తో విభేదాల కారణంగా తప్పుకున్నాడు. దీంతో నిర్మాతే మెగా ఫోన్ పట్టి మిగతా సినిమా పూర్తి చేసి డైరెక్టర్ గా తన పేరే వేసుకున్నాడు. డెవిల్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రానుంది.