Best Web Hosting Provider In India 2024
AP Group 1 Notification : ఏపీపీఎస్సీ గ్రూప్-1 సర్వీస్-2024 రిజిస్ట్రేషన్ ప్రక్రియను జనవరి 1 నుంచి ప్రారంభించింది. గ్రూప్-1 పోస్టులకు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ psc.ap.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 81 పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు జనవరి 21 చివరి తేదీ. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు దేశంలోని ఏదైనా విశ్వవిద్యాలయం గుర్తింపు పొందిన బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 17న గ్రూప్-1 పోస్టుల భర్తీకి ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు.
ట్రెండింగ్ వార్తలు
ఏపీపీఎస్సీ గ్రూప్-1 పోస్టులకు దరఖాస్తు ఇలా
- ఏపీపీఎస్సీ అధికారి వెబ్ సైట్ psc.ap.gov.in సందర్శించండి.
- హోమ్ పేజీలో ఉన్న ఏపీపీఎస్సీ గ్రూప్-1 రిక్రూట్మెంట్ 2023 లింక్ పై క్లిక్ చేయండి.
- మీ వివరాలు రిజిస్టర్ చేసుకోండి, అనంతరం అప్లికేషన్ ఫామ్ నింపండి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- సబ్మిట్ పై క్లిక్ చేసి పేజీని డౌన్ లోడ్ చేసుకోండి.
- తదుపరి అవసరాల కోసం అప్లికేషన్ హార్డ్ కాపీని భద్రపరచండి.
ఫీజు వివరాలు
అభ్యర్థులు దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.250, పరీక్ష ఫీజు కింద రూ.120 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజును నెట్ బ్యాంకింగ్/ క్రెడిట్ కార్డ్/ డెబిట్ కార్డు ఉపయోగించి పేమెంట్ గేట్ వే ద్వారా ఆన్ లైన్ లో చెల్లించాల్సి ఉంటుంది.
ప్రిలిమ్స్ పరీక్ష విధానం
స్కీనింగ్ టెస్ట్ లో భాగంగా ముందు ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 240 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. ఇందులో పేపర్-1లో 120 మార్కులకు 120 ప్రశ్నలు, పేపర్-2లో 120 మార్కులకు 120 మార్కులు అడుగుతారు. ఒక్కో పేపర్ కు గం. 2 ల సమయం కేటాయిస్తారు. పేపర్-1లో పార్ట్-ఏలో హిస్టరీ అండ్ కల్చర్, పార్ట్-బిలో రాజ్యాంగం, పాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, పార్ట్-సిలో ఏపీ, ఇండినయ్ ఎకానమీ, ప్లానింగ్, పార్ట్-డిలో జాగ్రఫి నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన వారికి మెయిన్స్ పరీక్ష రాసేందుకు అనుమతినిస్తారు.
మెయిన్స్ పరీక్ష విధానం
మెయిన్స్ రాత పరీక్షలో మొత్తం ఐదు పేపర్లు ఉంటాయి. వీటితోపాటు లాంగ్వేజెస్ పేపర్లు తెలుగు, ఇంగ్లీష్ కూడా ఉంటాయి. అయితే వీటిని క్వాలిఫైయింగ్ పరీక్షలుగా పరిగణిస్తారు. మొత్తం ఐదు పేపర్లలో ఒక్కో పేపర్ కు 150 మార్కుల చొప్పున మొత్తం 750 మార్కులకు మెయిన్స్ రాత పరీక్షను నిర్వహిస్తారు. మెయిన్స్ లో అర్హత సాధించిన అభ్యర్థులకు 75 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.