Best Web Hosting Provider In India 2024
Mothichoor Laddu: మోతీచూర్ లడ్డు ఎంతో మందికి ఫేవరెట్ స్వీట్. దీనితో చేసే పాయసం కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా ఇంట్లో తెచ్చిన మోతీచూర్ లడ్డూలు మిగిలిపోతే పాయసం చేయడానికి ప్రయత్నించండి. దీన్ని చేయడం చాలా సులువు. రుచి అదిరిపోతుంది. వారికి మోతీచూర్ ఖీర్ నచ్చేస్తుంది. దీన్ని ఎలా చేయాలో ఒకసారి చూద్దాం.
ట్రెండింగ్ వార్తలు
మోతీచూర్ లడ్డూ పాయసం రెసిపీకి కావలసిన పదార్థాలు
మోతీచూర్ లడ్డూలు – అయిదు
కుంకుమపువ్వు – మూడు రేకలు
తరిగిన పిస్తా – రెండు స్పూన్లు
పాలు – అర లీటరు
పంచదార పొడి – రెండు స్పూన్లు
బాదంపప్పు తరుగు – రెండు స్పూన్లు
మోతీచూర్ లడ్డు పాయసం రెసిపీ
1. ఒక గిన్నెలో లడ్డూలను వేసి చేతితోనే మెత్తగా మెదుపుకోవాలి.
2. రెండు టేబుల్ స్పూన్ల పాలలో కుంకుమపువ్వును వేసి పదినిమిషాల పాటూ నానబెట్టాలి.
3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి పాలును వేయాలి.
4. పాలును బాగా మరిగించాక కుంకుమపువ్వు నానబెట్టిన పాలు కూడా వేయాలి.
5. అందులోనే పిస్తా తరుగు, బాదం తరుగు, పంచదార పొడి వేసి ఉడికించాలి.
6. ఐదు నిమిషాల పాటు అలా మగ్గించాలి. గరిటెతో మూడు నాలుగు సార్లు కలుపుతూ ఉండాలి.
7. ఇప్పుడు ఆ మిశ్రమంలో మెదిపిన లడ్డూల పొడిని వేయాలి.
8. చిన్న మంట మీద పది నిమిషాలు పాటు ఉడికించాలి. దీన్ని చిన్న చిన్న కప్పుల్లో వేసి పైన జీడిపప్పుతో లేదా పిస్తా, బాదం తరుగుతో గార్నిష్ చేయాలి.
9. అంతే మోతీచూర్ లడ్డూ పాయసం రెడీ అయినట్టే. ఇది చాలా టేస్టీగా ఉంటుంది.
10. తాజా లడ్డూలతో చేస్తే ఇంకా బాగుంటుంది. దీన్ని కేవలం పావుగంటలో వండేసుకోవచ్చు.
సాయంత్రం పూట ఏదైనా తియ్యగా తినాలనిపిస్తే దీన్ని చేసుకోవడం చాలా సులువు. ఎవరైనా అతిధులు ఇంటికి వచ్చినప్పుడు త్వరగా చేసేందుకు ఈ పాయసం ఉపయోగపడుతుంది.