Pushpa 2 Release Date: పుష్ప 2 రిలీజ్ డేట్ వాయిదా పడిందా.. ఈ వార్తల్లో నిజమెంత?

Best Web Hosting Provider In India 2024


Pushpa 2 Release Date: అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప ది రూల్ మూవీ రిలీజ్ డేట్ పై మరోసారి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఈ సినిమా రిలీజ్ వాయిదా పడినట్లు కొందరు అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు. నిజానికి ఆగస్ట్ 15న ఇండిపెండెన్స్ డే లాంగ్ వీకెండ్ లో పుష్ప 2 రిలీజ్ అవుతుందని ఇప్పటికే మేకర్స్ వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు

కానీ తాజాగా కొన్ని రిపోర్టులు పుష్ప 2 రిలీజ్ వాయిదా పడిందని, త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని అంటున్నాయి. అటు సోషల్ మీడియాలో కొందరు ఫ్యాన్స్ కూడా రిలీజ్ డేట్ పై చర్చించుకుంటున్నారు. ఈ సినిమాలో కేశవ పాత్ర పోషించిన జగదీశ్ ప్రస్తుతం జైల్లో ఉండటంతో షూటింగ్ ఆలస్యమవుతోందని, అందుకే రిలీజ్ వాయిదా పడిందని ట్వీట్లు చేస్తుండటం గమనార్హం.

నిజానికి ఈ సినిమా ఆగస్ట్ 15న అజయ్ దేవ్‌గన్ సింగం అగైన్ మూవీతో కలిసి రిలీజ్ కానుంది. కానీ వాయిదా వార్తల నేపథ్యంలో ఇప్పుడు సింగం అగైన్ ఒక్కటే ఆ రోజు రిలీజ్ కాబోతోందని ట్రాక్ టాలీవుడ్ రిపోర్ట్ వెల్లడించింది. పుష్ప మూవీ తెలుగు కంటే హిందీ బెల్ట్ లోనే ఎక్కువ వసూళ్లు సాధించింది. పుష్ప 2పై కూడా అక్కడే ఆసక్తి ఎక్కువగా ఉంది.

ఈ నేపథ్యంలో మరోసారి హిందీ బెల్ట్ లో అల్లు అర్జున్ మానియా బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేయడం ఖాయమని భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రిలీజ్ డేట్ వాయిదా అన్న వార్తలు అభిమానులను నిరాశకు గురి చేస్తున్నాయి. 2021 డిసెంబర్ లో పుష్ప రిలీజైంది. అంటే రెండేళ్లు దాటిపోయింది. ఇప్పటికీ సీక్వెల్ ఓ కొలిక్కి రాలేదు. ఆగస్ట్ 15న రిలీజ్ అని గతేడాదే మేకర్స్ అనౌన్స్ చేయడంతో ఫ్యాన్స్ ఖుష్ అయ్యారు.

కానీ తాజాగా వస్తున్న వార్తలు నిజమైతే మాత్రం తీవ్ర నిరాశ తప్పదు. పుష్ప హిట్ తర్వాత పుష్ప ది రూల్ ను మరింత భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. ఈ సినిమా థియేట్రికల్ హక్కులను తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ.200 కోట్లకు అమ్మబోతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇప్పటి వరకూ కేవలం ఆర్ఆర్ఆర్ మాత్రమే ఇంత భారీ మొత్తానికి అమ్ముడైంది.

ఈ మధ్యే రిలీజైన సలార్ రూ.160 కోట్లకు అమ్ముడుపోయింది. అయితే ఏపీలోని కొన్ని ఏరియాల్లో సలార్ కు లాభాలు వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో పుష్ప 2 థియేట్రికల్ హక్కుల విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరించాలని బయర్లు నిర్ణయించుకున్నట్లు సమాచారం.

WhatsApp channel

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024