Best Web Hosting Provider In India 2024
నేటి జీవనశైలిలో మధుమేహం, గుండె సమస్యలు చాలా సాధారణం అయిపోయాయి. ఆరోగ్యంగా ఉండాలంటే గజిబిజి జీవనశైలిని వదిలించుకోవాలి. అప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. మంచి ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. తాజా కూరగాయలు, పండ్లను తినడంతో పాటు వివిధ రకాల గింజలు కూడా తినాలి. వీటిలో బాదం చాలా ముఖ్యమైనది. బాదం శరీరంలోని వివిధ సమస్యలను దూరం చేయడంతో పాటు బరువు నియంత్రణలో కూడా సహాయపడుతుంది.
ట్రెండింగ్ వార్తలు
మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వు అధికంగా ఉండే ఆహారం శరీరంలోని అదనపు కొవ్వును తొలగించడంలో సహాయపడుతుందని అనేక అధ్యయనాలు చూపిస్తున్నాయి. బాదం నూనెలో ఈ కొవ్వు ఉంటుంది. అందుకే బాదం నూనె బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఈ నూనె జీవక్రియ రేటును కూడా మెరుగుపరుస్తుంది. బాదం నూనెతో కలిగే ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం..
కొలెస్ట్రాల్‌లో ఎల్‌డిఎల్, హెచ్‌డిఎల్ అనే రెండు రకాలు ఉన్నాయి. LDL అంటే తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ చెడు కొలెస్ట్రాల్, HDL అంటే అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ మంచి కొలెస్ట్రాల్. మంచి కొలెస్ట్రాల్ హార్మోన్లు, జీర్ణ రసాలు, శారీరక విధులకు అవసరమైన విటమిన్ డి ఉత్పత్తికి సహాయపడుతుంది. రక్తనాళాలు సంకుచితం కాకుండా నిరోధిస్తుంది.
రక్తంలో ఎల్‌డిఎల్ స్థాయి పెరిగినప్పుడు చాలా శారీరక సమస్యలు తలెత్తుతాయి. ధమనులలో కొవ్వు పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. చెడు కొలెస్ట్రాల్ రక్తనాళాలను తగ్గిస్తుంది. గట్టిపడుతుంది. ఫలితంగా రక్త ప్రసరణ మీద ప్రభావం పడుతుంది. ఇది గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది.
అపరిశుభ్రమైన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం, శారీరక శ్రమ లేకపోవడం చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. బాదం నూనె రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది. ఇది శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా చేస్తుంది.
బాదం నూనె మధుమేహానికి చాలా మేలు చేస్తుంది. మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు పుష్కలంగా ఉండటం వల్ల ఈ నూనె రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. న్యూట్రిషన్ అండ్ మెటబాలిజం జర్నల్‌లో కూడా ఈ విషయం ప్రచురితమైంది. ఇది కాకుండా బాదం నూనె ఇన్సులిన్‌ను సమతుల్యం చేస్తుంది.
బరువు తగ్గాలనుకునేవారు బాదం నూనె డైట్‌లో చేర్చుకోవాలి. ఆరోగ్యంగా ఉంటారు. కొవ్వు తగ్గేందుకు సాయపడుతుంది. ఎంత మంచి ఆహారం తిన్నా.. శారీరక శ్రమ లేకపోతే బరువు పెరుగుతూనే ఉంటుంది. వేయిట్ కంట్రోల్ కావాలంటే కచ్చితంగా శారీరక శ్రమ ఉండాల్సిందే.