Sugar Levels: డయాబెటిస్ పేషెంట్లు షుగర్ లెవెల్స్ పెరగకుండా బంగాళాదుంపలను ఇలా తినొచ్చు

Best Web Hosting Provider In India 2024

Sugar Levels: డయాబెటిస్ పేషెంట్లు బంగాళాదుంపలను పూర్తిగా దూరం పెడతారు. వాటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరిగిపోతాయని భయపడతారు. అది నిజమే. కానీ బంగాళాదుంపలు తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే షుగర్ లెవెట్స్ పెరగకుండా చూసుకోవచ్చు, అలాగే బంగాళాదుంపల ఆహారాన్ని ఎంజాయ్ చేయవచ్చు. బంగాళాదుంపల్లో పిండి పదార్థం ఎక్కువ. అలాగే వీటి గ్లెసెమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువ. అందుకే వీటిని తినకూడదని పక్కన పెట్టేస్తారు.

ట్రెండింగ్ వార్తలు

బంగాళాదుంపలు తిన్నాక నేరుగా రక్తంలో చక్కెర స్థాయిలపై వేగంగా ఇది ప్రభావం చూపిస్తుంది. బంగాళాదుంపలను తిన్నాక అందులోని పిండి పదార్థాలు త్వరగా గ్లూకోజ్‌గా విచ్ఛిన్నం అవుతాయి. అందుకే రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరుగుతాయి. అయితే వీటిని జాగ్రత్తగా తింటే రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ పెరగకుండా సమతులాహారంలో భాగం చేసుకోవచ్చు.

బంగాళాదుంపలను ఇలా తినాలి

బంగాళాదుంపలు వండే పద్ధతిపైనా వీటిని తినాలా వద్దా అనేది ఆధారపడి ఉంటుంది. వీటిని అధిక మంట వద్ద వండకుండా సాధారణంగా వండాలి. అంటే బాగా కాగిన నూనెలో వేయించడం వంటివి చేయకూడదు. అలా చేస్తే వాటి వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. బంగాళాదుంపలను నీటిలో వేసి ఎంతగా ఉడికిస్తే వాటి గ్లెసెమిక్ ఇండెక్స్ అంతగా తగ్గుతుంది. కాబట్టి ఆలూ గడ్డలను ముందుగా నీటిలో వేసి బాగా ఉడికించాక కూర వండుకుని తినవచ్చు. స్టీమింగ్ పద్ధతిలో బంగాళాదుంపలను ఉడకబెట్టినా కూడా పోషకాలు పోకుండా గ్లెసెమిక్ ఇండెక్ష్ తగ్గుతుంది. ఇలా వండుకుని తిన్నా మంచిదే.

బంగాళాదుంపలను మాత్రమే తినే బదులు ఫైబర్, ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారాలతో మిక్స్ చేసుకోవాలి. పిండి పదార్థాల శోషణను తగ్గించడానికి చిక్కుళ్లు లేదా ఇతర ప్రొటీన్లు ఉన్న ఆహారంతో కలిపి తినాలి. బంగాళాదుంపలను ఉడకబెట్టాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అప్పుడు కూరగా వండుకోవాలి. ఇలా చేయడం వల్ల గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తగ్గుతుంది.

డయాబెటిస్ ఉన్నంత మాత్రాన బంగాళాదుంపలను పూర్తిగా పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. పైన చెప్పిన పద్ధతుల్లో జాగ్రత్తలు తీసుకుని మితంగా తినవచ్చు.

WhatsApp channel

టాపిక్

Source / Credits

Best Web Hosting Provider In India 2024