Best Web Hosting Provider In India 2024
02 Jan 2024 6:23 PM
మంత్రి గుడివాడ అమర్నాథ్
విశాఖ: దాడి వీరభద్రరావు రాజీనామాపై ఐటీ మంత్రి అమర్నాథ్ హాట్ కామెంట్స్ చేశారు. పార్టీలో ఉండి వెన్నుపోటు పొడవటం కంటే వెళ్లిపోవడమే పార్టీకి మంచిదని అన్నారు. వైయస్ఆర్‌సీపీ లో గెలిచే వారికి సీట్లు, కాంప్రమైజ్ కన్విన్స్ ఉండదని తెలిపారు. సీటు ఇస్తేనే ఉంటామని చెప్పే వ్యక్తులు పార్టీలో ఉండొద్దని పార్టీ స్పష్టంగా చెప్పిందని అన్నారు. ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేని వారికి ప్రత్యామ్నాయం ఇస్తామని వైవీ సుబ్బారెడ్డి కూడా చెప్పారని తెలిపారు. టికెట్లు రాని వ్యక్తులు పార్టీకి దూరంగా ఉండటం వల్ల పార్టీకి నష్టం లేదని వివరించారు. దాడి వీరభద్ర కుటుంబానికి ఇప్పటికే పార్టీ కొన్ని అవకాశాలు ఇచ్చింది, అప్పుడు తిరస్కరించారు.. ఆ విషయంలో వారిదే ఆఖరి నిర్ణయమని చెప్పారు.