Chanakaya Niti : భర్త దగ్గర భార్య ఈ విషయాలను దాచిపెడుతుంది

Best Web Hosting Provider In India 2024

చాణక్యుడు దౌత్యం, ఆర్థిక శాస్త్రం, రాజకీయాలలో నైపుణ్యం కలిగిన వ్యక్తి. జీవితానికి సంబంధించి చాణక్యుడు అనేక సలహాలు ఇచ్చాడు. చాణక్యుడు గొప్ప గురువు కూడా. ఆయన సూత్రాలను అనుసరిస్తే విజయం సాధించొచ్చు. చాణక్య నీతి డబ్బు, ఆరోగ్యం, వ్యాపారం, వైవాహిక జీవితం, సమాజం, జీవితంలో విజయానికి సంబంధించిన అనేక విషయాలపై సమాచారాన్ని అందిస్తుంది. ఏ వ్యక్తి అయినా తన జీవితంలో ఈ విషయాలను అంగీకరిస్తే, కచ్చితంగా విజయ శిఖరాలను చేరుకోగలడు.

ట్రెండింగ్ వార్తలు

అయితే భార్యాభర్తలు, వైవాహిక జీవితానికి సంబంధించిన అనేక విషయాలు చాణక్య నీతిలో ఉన్నాయి. అవి నేటి జీవితానికి సంబంధించినవి కూడా. చాణక్య నీతి ప్రకారం భార్యలు తమ భర్తల దగ్గర ఉద్దేశపూర్వకంగా కొన్ని విషయాలను దాస్తారు. కొన్ని రహస్యాలను భర్తలకు చెప్పరు. భవిష్యత్తు కోసం, భార్యాభర్తల మధ్య బంధాన్ని బలోపేతం చేయడం కోసం కొన్ని విషయాలను దాచిపెడతారు. చాణక్య నీతి ప్రకారం భార్యలు తమ భర్తల ముందు దాచే సాధారణ విషయాలు ఏంటో చూద్దాం..

వివాహానికి ముందు జరిగే వ్యవహారాల గురించి ఏ భార్యా భర్తకు చెప్పదు. వైవాహిక జీవితంలో ఎలాంటి అనుమానం రాకుండా సంతోషంగా జీవిస్తారనే ఉద్దేశంతో భార్య తన భర్తకు జీవితాంతం కొన్ని రహస్యాలను చెప్పదు.

భర్త తీసుకునే ప్రతి నిర్ణయానికి భార్య మద్దతు ఇస్తుంది. భర్త సంతోషంగా ఉండాలని, ఇంట్లో గొడవలు ఉండకూడదని ఆమె తన అసమ్మతిని బహిరంగంగా వ్యక్తం చేయదు. భర్త ఏది చెప్పినా భార్యలు పాటిస్తారని, అంగీకరిస్తారని చాణక్యుడు చెప్పాడు. భార్య తన అభిప్రాయాలను నేరుగా భర్తకు చెప్పదు.

భార్య ఇంటి తప్పుడు విషయాలను భర్త దగ్గర దాస్తుంది. ఇంట్లో గొడవలు ఉండవలు ఉండకూడదని ఆమె ఉద్దేశం. ఇంటి శాంతికి భంగం కలగకుండా ఉంచుతారు. సమస్యలను సాధ్యమైనంత ఉత్తమంగా నిర్వహిస్తారు.

వివాహానంతరం భార్యాభర్తలు ఎల్లప్పుడూ ఒకే విధంగా కదులుతారు. ఇంటిని నిర్వహించే భార్యను ఇంటి లక్ష్మిగా భావిస్తారు. భార్య ఎప్పుడూ ఇంటి ఖర్చులను తన భర్త నుండి దాచిపెడుతుంది. దాని గురించి అతనికి తెలియజేయదు. కుటుంబాన్ని నిర్ణీత బడ్జెట్‌తో నడుపుతుంది. అందరి అవసరాలను తీరుస్తుంది. అయితే కష్ట సమయాల్లో డబ్బును ఆదా చేస్తుంది. భవిష్యత్తులో సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు మహిళలు ఆ డబ్బును ఖర్చు చేస్తారు.

పెళ్లయ్యాక భర్తకు ఎలాంటి సమస్యలు, చిక్కులు తెచ్చిపెట్టడం భార్యకు ఇష్టం ఉండదు. భార్య తన అనారోగ్యాన్ని కూడా కొన్నిసార్లు భర్త దగ్గర దాచిపెడుతుంది. ఆమె భరించగలిగినంత కాలం భరిస్తుంది. భవిష్యత్తులో ఇదే పెద్ద సమస్యగా మారుతుంది. భవిష్యత్తులో వ్యాధి ఎక్కువైతే భర్తకు మరిన్ని కష్టాలు తప్పవని వారు ఆలస్యంగా గ్రహిస్తారు.

భార్య తన కోరికలను భర్త నుండి ఎప్పుడూ దాచిపెడుతుంది. తన భర్త ఇష్టానుసారం జీవిస్తుంది. ఆమె తన అభిప్రాయాలను భర్త ముందు పంచుకోవడానికి సంకోచిస్తుంది. పెళ్లయిన తర్వాత భార్య తన భర్త ఇష్టాన్ని తన సొంతం చేసుకుంటూ జీవనం సాగిస్తుందని చాణక్యనీతి చెబుతుంది.

WhatsApp channel
Source / Credits

Best Web Hosting Provider In India 2024