Best Web Hosting Provider In India 2024
Aata Sandeep Movie: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7లో తొలి కంటెంస్టెంట్‌గా హౌజ్‌లోకిఎంట్రీ ఇచ్చాడు ఆట సందీప్. టైటిల్ ఫేవరేట్లలో ఒకరిగా బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టిన ఆట సందీప్ ఊహించని విధంగా ఎనిమిదో వారంలో ఎలిమినేట్ అయ్యాడు. ఆరంభంలో గేమ్ బాగా ఆడిన సందీప్ ఆ తర్వాత తేలిపోయాడు.
ట్రెండింగ్ వార్తలు
బిగ్‌బాస్ సీజన్ 7లో ఫైనల్ వరకు చేరుకోలేకపోయినా సందీప్ ఈ షో ద్వారా పాపులర్ అయ్యాడు. బిగ్‌బాస్ ద్వారా వచ్చిన క్రేజ్‌ను ఉపయోగించుకుంటూ కొత్త సినిమాను అనౌన్స్‌చేశాడు ఆట సందీప్. ది షార్ట్‌కట్ పేరుతో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా కొత్త పోస్టర్‌ను ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు ఆట సందీప్.
ఈ పోస్టర్‌లో రివాల్వర్ పట్టుకొని ఆట సందీప్ కనిపిస్తున్నాడు. అంతే కాకుండా ఈ పోస్టర్‌పై బిగ్‌బాస్ బెస్ట్ సంచాలక్ ఆట సందీప్…కేఎస్ ప్రకాష్ పాత్రలో కనిపించబోతున్నట్లు రాసి ఉంది. ఈ పోస్టర్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. బెస్ట్ సంచాలక్ అన్నది అవార్డా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.బెస్ట్ సంచాలక్ అంటూ పోస్టర్‌లో రాసుకోవడం ఏంటి అంటూ విమర్శలు కురిపిస్తున్నారు.
గతంలో ఆట సందీప్ లవ్ యూ టూ అనే సినిమా చేశాడు. ఆట సందీప్ భార్య జ్యోతి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. పలు సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా ఆట సందీప్ వర్క్ చేశాడు.