Best Web Hosting Provider In India 2024
![](https://www.netisamajam.com/wp-content/uploads/2024/01/TS_LAWCET_Counselling_2023_1702087781505_1704255912249.jpg)
APNRTS Free Insurance: ప్రవాసాంధ్రుల సంక్షేమం కోసం పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ ఏపీఎన్ఆర్టీఎస్ (APNRTS) విదేశాల్లో చదువుకునే విద్యార్ధులకు ఉచిత బీమా అందిస్తున్నట్లు ప్రకటించింది.
ట్రెండింగ్ వార్తలు
విద్యార్ధులకు అమలు చేస్తున్న ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకాన్ని విదేశాల్లో విద్యనభ్యసిస్తున్న ఏపీ విద్యార్థులు, విదేశాల్లో పనిచేసే వారు బీమాలో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు పూర్తీగా ఉచితంగా బీమాలో నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించింది.
ఈ అవకాశం 15 జనవరి 2024 వరకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. జనవరి 15 తర్వాత బీమా ప్రీమియం పెరిగి, ప్రయోజనాలు తగ్గే అవకాశం ఉన్నందున వెంటనే నమోదు చేసుకోవాలని సూచించారు. గతంలో సంవత్సరానికి రూ.180 ల ప్రీమియంగా ఉండేది.
లక్షలు ఖర్చుపెట్టి తల్లిదండ్రులు వారి పిల్లలను విదేశీ విద్యకు పంపుతున్నారని అలా వెళ్ళిన ఎంతో మంది విద్యార్థులకు మరియు వారి కుటుంబానికి ఈ పథకం ఒక భరోసా కల్పిస్తుందని ఏపీఎన్నార్టీఎస్ తెలిపింది. విదేశాల్లో చదువుకునే విద్యార్థులు సరదాగా బయటకు వెళ్లినప్పుడు, విహారయాత్రలకు వెళ్ళినప్పుడు అనుకోకుండా ప్రమాదాలకు గురవుతున్నారని, బీమాలో నమోదు చేసుకోవడం వల్ల హఠాత్తుగా అనుకోని పరిణామాలు జరిగినప్పుడు వారి కుటుంబానికి ఆర్థికంగా ఆసరాగా ఉంటుందని తెలిపారు.
విద్యార్థులు, వారి తరఫున వారి పేరు మీద తల్లిదండ్రులు ప్రవాసాంధ్ర భరోసా బీమా లో ఉచితంగా నమోదు చేసుకోమని ఏపీఎన్ఆర్టీ సొసైటీ అధ్యక్షులు వెంకట్ ఎస్. మేడపాటి కోరారు.
బీమాలో ముఖ్య ప్రయోజనాలు
1. బీమా తీసుకున్న వ్యక్తి ప్రమాదం వలన మరణించినా, శాశ్వత అంగవైకల్యం కలిగినా రూ. 10 లక్షల ఆర్థిక సహాయం అందిస్తారు.
2. ప్రమాదం వలన సంభవించే గాయాలు, అనారోగ్యం చికిత్సకు అయ్యే హాస్పిటల్ ఖర్చులకు రూ. 1లక్ష వరకు చెల్లిస్తారు
3. ప్రమాదం/అస్వస్థతకు గురై చదువు కొనసాగించడానికి అనర్హుడిగా గుర్తించినట్లైతే, స్వదేశం వచ్చేందుకు సాధారణ తరగతి విమాన ఛార్జీల చెల్లిస్తారు. ఇవే కాకుండా మరెన్నో ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు.
ప్రవాసాంధ్ర భరోసా బీమా నమోదుకు APNRTS 24/7 హెల్ప్‌లైన్ +91-863-2340678; +91 85000 27678 (వాట్సప్) ను సంప్రదించాలని కోరారు. వెబ్ సైట్-బీమా పేజి https://www.apnrts.ap.gov.in/index.php/home/insurance_new లో లాగిన్ అవ్వాలని insurance@apnrts.com; helpline@apnrts.com కు ఇమెయిల్ చేయాలని సూచించారు. ఏపీఎన్ఆర్టీఎస్ అందించే వివిధ సేవలు, అప్డేట్స్ కొరకు https://www.apnrts.ap.gov.in/ ని సందర్శించాలని కోరారు.