Mathu Vadhalara Sequel: సర్‌ప్రైజ్ హిట్ మత్తు వదలరా సీక్వెల్ వచ్చేస్తోంది

Best Web Hosting Provider In India 2024

Mathu Vadhalara Sequel: మత్తు వదలరా మూవీ టాలీవుడ్ ఇండస్ట్రీ, ఇక్కడి ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసింది. నాలుగేళ్ల కిందట వచ్చిన ఈ సినిమా.. కథను సరికొత్తగా చెబుతూ ఆడియెన్స్ ను ఎలా మెస్మరైజ్ చేయొచ్చో నిరూపించింది. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ సినిమాతోనే టాలీవుడ్‌కు రితేష్ రానా దర్శకుడిగా పరిచయమయ్యాడు.

ట్రెండింగ్ వార్తలు

కీరవాణి తనయుడు శ్రీ సింహ కూడా మత్తు వదలరా మూవీ ద్వారానే హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డైరెక్టర్, హీరోకి ఈ మూవీ మంచి బ్రేక్ ఇచ్చినా.. తర్వాత వీళ్లు ఆ సక్సెస్ ను నిలుపుకోలేకపోయారు. శ్రీ సింహ తర్వాత తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త, భాగ్ సాలే, ఉస్తాద్ లాంటి సినిమాలు చేసినా.. విజయం అందుకోలేకపోయాడు.

అటు డైరెక్టర్ రితేష్ కూడా హ్యాపీ బర్త్ డే మూవీ చేశాడు. ఈ కామెడీ మూవీ కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో తమకు మంచి సక్సెస్ ఇచ్చిన మత్తు వదలరా సీక్వెల్ తో ప్రేక్షకుల ముందుకు రావాలని ఈ కాంబో నిర్ణయించినట్లు తెలుస్తోంది. నిజానికి మొదట హ్యాపీ బర్త్ డే సీక్వెల్ తీయాలని రితేష్ నిర్ణయించినా.. తర్వాత మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది.

శ్రీ సింహతోపాటు మత్తు వదలరాలో అతని సహచరుడిగా నటించిన సత్య కూడా ఈ సీక్వెల్లో ఉండనున్నాడు. సీక్వెల్స్ కు మంచి ఆదరణ లభిస్తున్న ఈ సమయంలో మత్తు వదలరా 2 కూడా ఆసక్తి రేపుతుందనడంలో సందేహం లేదు. 2019, డిసెంబర్ లో రిలీజైన మత్తు వదలరా మూవీ ప్రేక్షకులను నవ్వించడంతోపాటు సస్పెన్స్ తో చివరి వరకూ సీట్లకు అతుక్కుపోయేలా చేసింది.

ఈ మత్త వదలరా మూవీలో బాబు, యేసు అనే డెలివరీ ఏజెంట్ల పాత్రలు పోషించారు శ్రీసింహ, సత్య. తెలుగులో థ్రిల్లర్ మూవీస్ కి ఓ కొత్త అర్థం చెప్పిన సినిమాగా దీనిని చెప్పొచ్చు. డైరెక్టర్ రితేష్ కు ఇదే తొలి సినిమా అంటే నమ్మలేం. అంత పక్కాగా స్క్రిప్ట్ వర్క్ తో మత్తు వదలరాను తెరకెక్కించాడు. ఇప్పుడు సీక్వెల్ ను కూడా అదే స్థాయిలో తెరకెక్కిస్తాడన్న అంచనా ప్రేక్షకుల్లో ఉంది.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024