
Best Web Hosting Provider In India 2024

Saindhav Trailer: వెంకటేష్ హీరోగా నటించిన సైంధవ్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ అవుతోంది. బుధవారం ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. యాక్షన్ అంశాలతో ట్రైలర్ ఇంట్రెస్టింగ్‌గా సాగింది. ట్రైలర్‌లో వెంకటేష్ క్యారెక్టర్ పవర్‌ఫుల్ సాగింది. తండ్రీకూతుళ్ల బాండింగ్‌తో పాటు యాక్షన్ అంశాలకు సమప్రాధాన్యతనిస్తూ కట్ చేసిన ట్రైలర్ అభిమానులను ఆకట్టుకుంటుంది.
ట్రెండింగ్ వార్తలు
ట్రైలర్‌లోని యాక్షన్ అంశాలు గూస్‌బంప్స్‌ను కలిగిస్తోన్నాయి. సైంధవ్ సినిమాకు హిట్ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు. సైంధవ్ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్, రుహాణి శర్మతో పాటు ఆండ్రియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ విలన్‌గా కనిపించబోతున్నాడు.
సైంధవ్ సినిమాతోనే నవాజుద్దీన్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అంతే కాకుండా మరో ఇంపార్టెంట్ రోల్‌లో కోలీవుడ్ హీరో ఆర్య కనిపించబోతున్నాడు.
సైంధవ్ సినిమా తెలుగు, హిందీతో పాటు పాన్ ఇండియన్ లెవల్‌లో రిలీజ్ అవుతోంది. సైంధవ్ సినిమాను తొలుత క్రిస్మక్‌కు రిలీజ్ చేయాలని భావించారు. కానీ ప్రభాస్ సలార్ క్రిస్మర్‌కు బాక్సాఫీస్ బరిలో నిలవడంతో సైంధవ్ సంక్రాంతికి వచ్చేస్తోంది.