Army Public School Jobs : సికింద్రాబాద్ ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో టీచింగ్ ఉద్యోగాలు – అర్హతలు, ముఖ్య తేదీలివే

Best Web Hosting Provider In India 2024

Army Public School RK Puram Secunderabad Recruitment: సికింద్రాబాద్ ఆర్.కె.పురంలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ నుంచి ఉద్యోగ ప్రకటన విడుదైంది. 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించిన టీచింగ్ పోస్టుల భర్తీకి ప్రకటనను జారీ చేసింది.ఈ నోటిఫికేషన్ లో భాగంగా…. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), ట్రైయిన్డ్ గ్రాడ్యుయేట్(టీజీటీ), ప్రైమరీ టీచర్స్(పీఆర్‌టీ), ప్రీ ప్రైమరీ టీచర్స్, హెడ్‌ మిస్ట్రెస్‌ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. జనవరి 15 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు

ముఖ్య వివరాలు:

ఉద్యోగ ప్రకటన – సికింద్రాబాద్ ఆర్.కె.పురంలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్.

మొత్తం ఉద్యోగాలు – 62

ఖాళీలు వివరాలు – పీజీటీ – 05, టీజీటీ -30, పీఆర్టీ – 16, హెడ్‌ మిస్ట్రెస్‌ -2, ప్రీప్రైమరీ టీచర్ -9,

అర్హతలు – పీజీటీ పోస్టులకు కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో పీజీ డిగ్రీతోపాటు బీఈడీ అర్హత ఉండాలి. ఇంగ్లిష్ మీడియంలో బోధన చేయగలగాలి. కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి. టీజీటీ ఉద్యోగాలకు కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో డిగ్రీతోపాటు బీఈడీ అర్హత ఉండాలి. సీటెట్/టెట్ అర్హత ఉండాలి. ఇంగ్లిష్ మీడియంలో బోధన చేయగలగాలి. కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి. పీఆర్టీ పోస్టుల విషయంలో… కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో డిగ్రీతోపాటు బీఈడీ అర్హత ఉండాలి. సీటెట్/టెట్ అర్హత ఉండాలి. సీటెట్/టెట్ అర్హత ఉండాలి. ఇంగ్లిష్ మీడియంలో బోధన చేయగలగాలి. కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి.

దరఖాస్తులు – ఆఫ్ లైన్

వయోపరిమితి – 55 సంవత్సరాలకు మించకూడదు.

ఆప్లికేషన్ ఫీజు – రూ.100.

ఎంపిక విధానం – అర్హతలు, అనుభవం ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తుకు చివరితేది – 15, జనవరి, 2024.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా-

The Principal,

Army Public School,

RK Puram, Secunderabad.

అధికారిక వెబ్ సైట్ – https://apsrkpuram.edu.in/

WhatsApp channel
Source / Credits

Best Web Hosting Provider In India 2024