Best Web Hosting Provider In India 2024
Ponnam prabhakar: బిఆర్‌ఎస్ అధ్యక్షుడు కెసిఆర్‌ను రక్షించడానికే బీజేపీ సీబీఐ విచారణ కోరుతోందని, సీబీఐ బీజేపీ పెంపుడు సంస్థ కాబట్టి దానితో విచారణ జరపాలంటున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలనే కిషన్ రెడ్డి డిమాండ్‌ను పొన్నం తప్పు పట్టారు.
ట్రెండింగ్ వార్తలు
కేసీఆర్‌పై జ్యుడీషియల్ విచా రణ చేయించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అయితే దీనికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సహకరించాలని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ను రక్షించడానికే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చిలుక పలుకులు పలుకుతున్నారని ధ్వజమెత్తారు.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే ఉన్నా ఇప్పటివరకు కేసీఆర్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నెల రోజులు కూడా కాలేదని, అప్పుడే ప్రభుత్వంపై ప్రతిపక్ష నేతలు ఏదేదో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్య క్తం చేశారు.
బీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒక్కటేనని, గోషామహ ల్‌లో బిఆర్‌ఎస్ పోటీ చేయలేదని, జూబ్లీహిల్స్‌లో మాత్రం బిఆర్‌ఎస్ పోటీ చేసిన తీరు తీస్తుంటే వీళ్ల స్నేహం అర్థం అవుతుందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై బీఆర్‌ఎస్ నేతలు లేనిపోని అపోహలు స్పష్టిస్తున్నారని, ఆటో డ్రైవర్లతో ధర్నాలు చేయిస్తున్నారని ఆరోపించారు.
ఉచిత బస్సు ప్రయాణంపై మాట్లాడేందుకు ఎవరు వచ్చినా తాను రెడీగా ఉంటానని, సచివాలయంలోనైనా మాట్లాడేందుకు సిద్ధమన్నారు. ప్రజాపాలన దరఖాస్తులకు ఈనెల 6 వరకే గడువు అని, గడువు పొడిగింపు ఉండదని మంత్రి పొన్నం స్పష్టం చేశారు.