Trisha Brinda Web Series: త్రిష డెబ్యూ తెలుగు వెబ్ సిరీస్ బృందా స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే – ఓటీటీలోకి వ‌చ్చేది అప్పుడే

Best Web Hosting Provider In India 2024

Trisha Brinda Web Series: న‌ట‌న ప‌రంగా త‌మ‌లోని కొత్త కోణాల‌ను ఆడియెన్స్‌ను చూపించేందుకు ఓటీటీని చ‌క్క‌టి వేదిక‌గా వాడుకుంటున్నారు స్టార్‌. వెండితెర‌పై చేయ‌లేని ప్ర‌యోగాలు, పాత్ర‌ల‌ను ఓటీటీల‌లో చేస్తూ అభిమానుల‌ను మెప్పిస్తున్నారు. వెంక‌టేష్‌, నాగ‌చైత‌న్య‌, త‌మ‌న్నా, కాజ‌ల్ వంటి ప‌లువురు స్టార్స్ ఇప్ప‌టికే ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చారు. తాజాగా వారి బాట‌లో త్రిష అడుగులు వేయ‌బోతున్న‌ది. బృందా పేరుతో తెలుగులో వెబ్ సిరీస్ చేసింది.

ట్రెండింగ్ వార్తలు

యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కుతోన్న ఈ వెబ్ సిరీస్‌లో త్రిష పోలీస్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ది. ఈ సిరీస్‌కు సూర్య వంగ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. చాలా రోజుల క్రిత‌మే బృందా వెబ్ సిరీస్ షూటింగ్ పూర్త‌యింది. బ్యాక్ టూ బ్యాక్ డిజాస్ట‌ర్స్‌తో త్రిష మార్క‌ట్ డౌన్ కావ‌డంతో పాటు బ‌డ్జెట్‌, ప్రీ ప్రొడ‌క్ష‌న్ ఇష్యూస్ కార‌ణంగా సిరీస్ రిలీజ్ డిలే అవుతూ వ‌చ్చింది. పొన్నియ‌న్ సెల్వ‌న్‌, విజ‌య్ లియో సినిమాల‌తో త్రిష గ్రాండ్ క‌మ్‌బ్యాక్ ఇచ్చింది.

ఈ సినిమాల‌తో మ‌ళ్లీ స‌క్సెస్ ట్రాక్ ఎక్కిన త్రిష ద‌క్షిణాదిలో హీరోయిన్‌గా బిజీగా మారిపోయింది. బృందా సిరీస్‌ను రిలీజ్ చేసేందుకు ఇదే స‌రైన టైమ్‌గా భావించిన మేక‌ర్స్ ఆ ప్ర‌య‌త్నాల్లో ఉన్న‌ట్లు తెలిసింది. బృందా సిరీస్ స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను సోనీలివ్ సొంతం చేసుకున్న‌ట్లు స‌మాచారం. ఫిబ్ర‌వ‌రి నెలాఖ‌రు లేదా మార్చి ప్ర‌థ‌మార్థంలో బృందా వెబ్‌సిరీస్ సోనీ లివ్‌లో రిలీజ‌య్యే అవ‌కాశం ఉన్న‌ట్లు చెబుతున్నారు.

త్వ‌ర‌లోనే త్రిష వెబ్ సిరీస్ రిలీజ్ డేట్‌పై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం. బృందా సిరీస్‌లో సాయికుమార్‌, ఇంద్ర‌జీత్ సుకుమార‌న్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ప్ర‌స్తుతం త్రిష తెలుగులో చిరంజీవి విశ్వంభ‌ర‌లో ఓ హీరోయిన్‌గా న‌టించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024