Lavanya Tripathi: బిగ్‌బాస్ విన్న‌ర్‌తో లావ‌ణ్య త్రిపాఠి వెబ్ సిరీస్ – టైటిల్‌, ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌!

Best Web Hosting Provider In India 2024

Lavanya Tripathi: పెళ్లి త‌ర్వాత వెబ్‌సిరీస్‌తో యాక్టింగ్‌లోకి రీఎంట్రీ ఇస్తోంది లావ‌ణ్య త్రిపాఠి. ఈ వెబ్‌సిరీస్ టైటిల్‌, ఫ‌స్ట్ లుక్‌ను బుధ‌వారం రిలీజ్ చేశారు. ఈ సిరీస్‌కు మిస్ ప‌ర్‌ఫెక్ట్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ట్రాలీ బ్యాగ్‌పై కూర్చొని నోట్లో వేలు పెట్టుకొని అమాయ‌క‌పు అమ్మాయిగా ఫ‌న్నీ లుక్‌లో లావ‌ణ్య త్రిపాఠి క‌నిపిస్తోంది.

 

ట్రెండింగ్ వార్తలు

ఈ సిరీస్‌లో బిగ్‌బాస్ విన్న‌ర్ అభిజీత్ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌లో లాప్ ట్యాప్ చేతిలో ప‌ట్టుకొని చిరున‌వ్వులు చిందిస్తూ అభిజీత్ క‌నిపిస్తోన్నాడు. మిస్ ఫ‌ర్‌ఫెక్ట్ వెబ్ సిరీస్‌కు విశ్వ‌క్ కే ఖండేరావ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. గ‌తంలో నిత్యామీన‌న్‌, స‌త్య‌దేవ్‌ల‌తో స్కైలాబ్ అనే సినిమా చేశాడు విశ్వ‌క్‌. మిస్ ప‌ర్‌ఫెక్ట్ వెబ్‌సిరీస్‌ను అన్న‌పూర్ణ స్టూడియోస్ ప‌తాకంపై సుప్రియ యార్ల‌గ‌డ్డ నిర్మిస్తోంది.

డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో ఈ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది. వెబ్ సిరీస్ రిలీజ్ డేట్‌ను త్వ‌ర‌లోనే అనౌన్స్ చేయ‌బోతున్నారు. పులి మేక త‌ర్వాత తెలుగులో లావ‌ణ్య త్రిపాఠి న‌టిస్తోన్న‌ సెకండ్ వెబ్ సిరీస్ ఇది.

మెగా హీరోతో ఏడ‌డుగులు..

మెగా హీరో వ‌రుణ్ తేజ్‌తో చాలా కాలంగా ప్రేమ‌లో ఉన్న లావ‌ణ్య త్రిపాఠి ఇటీవ‌లే అత‌డితో ఏడ‌డుగులు వేసింది. గ‌త ఏడాది న‌వంబ‌ర్ 1న ఇట‌లీలోని ట‌స్క‌నీలో ఈ జంట పెళ్లి చేసుకున్నారు. వ‌రుణ్‌, లావ‌ణ్య డెస్టినేష‌న్ వెడ్డింగ్‌కు మెగా కుటుంబ‌స‌భ్యుల‌తో పాటు కొంత‌మంది టాలీవుడ్ ప్ర‌ముఖులు మాత్ర‌మే హాజ‌ర‌య్యారు.

 

WhatsApp channel
 
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024