![](https://www.netisamajam.com/wp-content/uploads/2024/01/manisharma_mahesh_1704267479551_1704267488012.jpeg)
Best Web Hosting Provider In India 2024
![](https://www.netisamajam.com/wp-content/uploads/2024/01/manisharma_mahesh_1704267479551_1704267488012.jpeg)
Mani Sharma on Mahesh Babu: టాలీవుడ్లో మహేష్ బాబు, పవన్ కల్యాణ్‌లకు మంచి మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ.. తాజాగా వాళ్లపై సంచలన కామెంట్స్ చేశాడు. మహేష్ బాబుకు తనపై ఎవరో బాగా ఎక్కించారని, కనీసం రెండు పెగ్గులు తాగడానికి కూడా తనను పిలవడం లేదని అతడు అనడం విశేషం.
ట్రెండింగ్ వార్తలు
మహేష్, పవన్ కల్యాణ్ లాంటి హీరోలు అందరు మ్యూజిక్ డైరెక్టర్లకు అవకాశం ఇవ్వాలని కూడా మణిశర్మ అన్నాడు. ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో ఈ మ్యూజిక్ డైరెక్టర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మహేష్ బాబుకు ఒక్కడు, మురారి, పోకిరి, ఖలేజాలాంటి హిట్స్.. పవన్ కల్యాణ్ కు ఖుషీ, గుడుంబా శంకర్ లాంటి మ్యూజికల్ హిట్స్ అందించిన ఘనత మణిశర్మదే.
కానీ ఈ ఇద్దరూ ఈ మధ్య కాలంలో మణిశర్మతో సినిమాలు చేయడం లేదు. దీనికి కారణం ఏంటని అడిగితే అతడు ఈ కామెంట్స్ చేశాడు. మహేష్ బాబుతో తన చివరి సినిమా వరకూ పూర్తి నిబద్ధతతో పని చేశానని, అయితే తర్వాత ఏం జరిగిందో, ఎవరు తనపై ఏం ఎక్కించారో తెలియదని మణిశర్మ అన్నాడు. భవిష్యత్తులో మహేష్ తో ఏవైనా సినిమాలు చేస్తారా అని అడగ్గా.. అతడు కనీసం రెండు పెగ్గులు తాగడానికి కూడా తనను పిలవడం లేదని చెప్పాడు.
ఇక పవన్ కల్యాణ్ గురించి స్పందిస్తూ.. అతడితో తనకు మంచి బాండింగ్ ఉండేదని గుర్తు చేసుకున్నాడు. పవన్ కెరీర్లో సూపర్ డూపర్ మ్యూజికల్ హిట్స్ అయిన ఖుషీ, గుడుంబా శంకర్ మ్యూజిక్ ఎలా చేశామో కూడా చెప్పాడు. ఖుషీలో కేవలం చెలియ చెలియ పాటను తాను పవన్ తో కలిసి కూర్చొని మ్యూజిక్ కంపోజ్ చేశానని, గుడుంబా శంకర్ లో మాత్రం అన్ని పాటలను ఇద్దరం కలిసి చేసినట్లు తెలిపాడు.
మహేష్, పవన్ కల్యాణ్ అందరికీ అవకాశం ఇవ్వాలని కోరాడు. దేవీ శ్రీకి ఒకటి, తమన్ కు ఒకటి, తనకు ఒకటి.. ఇలా ఇస్తే ప్రేక్షకులకు ఓ డిఫరెంట్ మ్యూజిక్ అందుతుందని అభిప్రాయపడ్డాడు. వాళ్లకు రెండేసి సినిమాలు ఇచ్చినా తనకు ఒకటైనా ఇవ్వాలని వేడుకోవడం గమనార్హం. సర్కారు వారి పాట సినిమాకు కూడా మ్యూజిక్ మణిశర్మకే ఇవ్వాలని ఫ్యాన్స్ అభిప్రాయపడినా.. తమన్ కు ఆ అవకాశం దక్కింది.
కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలో టాలీవుడ్ లో చిరస్థాయిగా నిలిచిపోయే ఎన్నో హిట్ సాంగ్స్ అందించాడు మణిశర్మ. కానీ కొంతకాలంగా అతనికి సినిమాలు కరవయ్యాయి. ఆ మధ్య ఆచార్య, శాకుంతలంలాంటి సినిమాలు చేసినా.. అతనిలో మునుపటి జోరు కనిపించలేదు.