Best Web Hosting Provider In India 2024
![](https://www.netisamajam.com/wp-content/uploads/2024/01/b6cdf203-af7e-4aec-a580-bbf03a8bb106.jpg)
పెన్షన్ల పెంపు కార్యక్రమంలో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి
66.34 లక్షల మందికి మంచి జరిగేలా పెన్షన్ అందిస్తున్నాం.
పెన్షన్‌ల కోసం దాదాపుగా నెలకు రూ.2వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం.
పండుగైనా, సెలవైనా ఒకటో తేదీనే జగనన్న సైన్యం వలంటీర్లు పెన్షన్ పంపిణీ చేస్తున్నారు
చంద్రబాబు, పవన్ కలిసి 2014లో ఎన్నో హామీలు ఇచ్చారు. పేదలకు ఒక్క సెంటు కూడా ఇవ్వలేదు
రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణాన్ని ఆపాలనేది దత్తపుత్రుడి దిక్కుమాలిన ఆలోచన
చంద్రబాబు అవినీతిలో భాగస్వామి కాబట్టే దత్తపుత్రుడు ప్రశ్నించడు.
ప్రతీ గ్రామంలో సచివాలయం తెచ్చాం, ఆర్బీకే, విలేజ్ క్లినిక్, జగనన్న ఆరోగ్య సురక్ష తీసుకొచ్చాం. చంద్రబాబు హయాంలో ఇవ్వన్నీ ఎందుకు జరగలేదు.
రాబోయే రోజుల్లో కుట్రలకు తెరతీస్తారు.పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారు.. కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేస్తారు..మీరందరూ అప్రమత్తంగా ఉండాలి
మీ బిడ్డ నమ్ముకున్నది పైన దేవుడిని, ఇక్కడ ప్రజలనే: సీఎం వైయస్ జగన్
కాకినాడ: ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు రూ.3వేలకు పెంచామని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. పేదల జీవితాల్లో ఆనందం వెల్లివిరియాలి. తమను తాము పోషించుకోలేని పరిస్థితి ఎవరికీ రాకూడదని అక్షరాల 66.34 లక్షల మందికి మంచి జరిగేలా పెన్షన్ అందిస్తున్నామన్నారు. పెన్షన్‌ల కోసం దాదాపుగా నెలకు రూ.2వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. పండుగైనా, సెలవైనా ఒకటో తేదీనే పెన్షన్ అందిస్తున్నాం. నా జగనన్న సైన్యం వలంటీర్లు పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. అర్హత ఉంటే చాలు మీ కష్టం నా కష్టంగా భావించి ఈ రోజు ప్రతి ఒక్కరికి తోడుగా అండగా నిలబడే కార్యక్రమం ఈ రోజు మీ బిడ్డ పాలనలోనే జరుగుతుందని చెప్పడానికి గర్వపడుతున్నాను. చంద్రబాబు పాలనలో పెన్షన్ కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే. ఎన్నికల ముందు మీ జగన్ హామీ ఇవ్వకుండా ఉంటే చంద్రబాబు పెన్షన్ పెంచేవాడా? అని ప్రశ్నించారు. గతానికి, మన ప్రభుత్వానికి తేడాను గమనించాలి. మన ప్రభుత్వంలో రూ.లక్షా 47వేలు అందిస్తున్నాం. గతంలో జన్మభూమి కమిటీల ద్వారా అర్హులను నిర్ణయించే వారు. చంద్రబాబు హయాంలో పెన్షన్ తీసుకోవాలంటే లంచం ఇస్తే తప్ప పని జరిగేది కాదన్నారు. గతంలో ఎన్నికలకు ఆరునెలల ముందు వరకు 39లక్షల మందికి మాత్రమే పెన్షన్ ఇచ్చారు. ఎన్నికల రెండు నెలల ముందు వరకు కేవలం రూ.1000 పెన్షన్ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం మేము పెన్షన్‌ను పెంచుకూంటూ రూ.3వేలు అందిస్తున్నాం. బాబు నెలకు రూ.400కోట్లు ఇచ్చారు. ఇప్పుడు రూ.2వేల కోట్లు ఇస్తున్నాం. పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ అందజేస్తున్నామని తెలిపారు. చంద్రబాబు అవినీతిలో పవన్ కల్యాణ్ కూడా పాట్నర్. చంద్రబాబు అవినీతిపై ఈనాడు, ఆంధ్రజ్యోతి ఏమీ రాయవు. చంద్రబాబు అవినీతిని ఈటీవీ, ఏబీఎన్, టీవీ-5 చూపించవన్నారు. చంద్రబాబు అవినీతిని కేంద్ర దర్యాప్తు సంస్థలు నిర్ధారించి న్యాయస్థానం జైలుకు పంపింది. జైల్లో ఉన్న అవినీతిపరుడు చంద్రబాబును దత్తపుత్రుడు పరామర్శిస్తాడు. అవినీతికి తావులేకుండా పాలన చేస్తున్న మన ప్రభుత్వంపై విమర్శలు చేస్తాడు. చంద్రబాబు అవినీతిలో భాగస్వామి కాబట్టే దత్తపుత్రుడు ప్రశ్నించడని విమర్శించారు. రాబోయే రోజుల్లో కుట్రలకు తెరతీస్తారు. రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారు. కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేస్తారు. మీరందరూ అప్రమత్తంగా ఉండాలని సీఎం వైయస్ జగన్ సూచించారు. కాకినాడలో ఏర్పాటు చేసిన పింఛన్ల పెంపు కార్యక్రమంలో సీఎం వైయస్ జగన్ పాల్గొని ప్రసంగించారు.
సీఎం వైయస్ జగన్ ఏమన్నారంటే..
- ఈ రోజు మీ అందరి చిక్కటి చిరునవ్వుల మధ్య, మీరు చూపిస్తున్న ఈ ప్రేమానురాగాల మధ్య, ఆత్మీయతల మధ్య, దేవుడి దయతో మరో మంచి కార్యక్రమం జరుగుతోంది.
- ఈ రోజు పెన్షన్ల పెంపు ఇచ్చిన మాట ప్రకారం రూ.3 వేల దాకా తీసుకుని పోతానని చెప్పిన మాట ప్రకారం నెరవేర్చి మీ అందరి సంతోషాల మధ్య ఈ కార్యక్రమం జరుపుకోవడం దేవుడు నాకిచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను.
- మీ అందరి ప్రేమానురాగాల మధ్య ఈ కార్యక్రమం చేస్తూ..ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
- కొత్త సంవత్సరం అంటే కేవలం క్యాలెండర్‌లో ఒక మార్పు మాత్రమే కాదు..అది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా వారి ఆదాయం పెరగాలి. వారి ఆనందం కూడా మెరుగైన పరిస్థితికి చేరుకోవాలి. అలాంటి గొప్ప కార్యక్రమంలో ఈ రోజు పాలుపంచుకుంటున్నాను.
- ఈ రోజు పెన్షన్ తీసుకుంటున్న వీరందరి పరిస్థితి గమనిస్తే..పెద్ద వయసు ఉన్నవారు, విధి రాత వల్ల తమకు తాము పోషించుకోలేని పరిస్థితిలో అక్షరాల 64 లక్షల 34 వేల మంది ఉన్నారు. ఈ రోజు ఆ అభ్యాగులకు, వితంతువులకు మంచి చేస్తూ సామాజిక పెంఛన్‌ను అక్షరాల రూ.3 వేలకు పెంచాం.
- ఈ రోజు మనం చేస్తున్న 64.34 లక్షల మందికి పింఛన్ల కోసం చేస్తున్న ఖర్చు నెల నెల అక్షరాలు దాదాపుగా రూ.2 వేల కోట్లు అని చెప్పడానికి సంతోషపడుతున్నాను. నెల 1వ తారీఖున పండుగైనా, సెలవు, ఆదివారం అయినా సరే..మీ జగనన్న సైన్యం, నా వాలంటీర్లు మాత్రం అవ్వాతాతల ముఖంలో చిరునవ్వులు చూసే రోజు.
- పొద్దునే సూర్యోదయం సమయంలోనే గుడ్ మార్నింగ్ చెబుతూ ఒక మంచి మనవుడిగా, మనవరాలిగా తోడుగా చేయూత నిస్తున్న నా వాలంటీర్లకు సెలవుదినం కాదు.
- ఇంత మంచి కార్యక్రమం జరుగుతున్న పరిస్థితిలో ఒక్కసారి గతానికి వెళ్లండి. ఐదేళ్ల క్రితం పరిస్థితి గమనించండి.
- అప్పట్లో చంద్రబాబు పరిపాలనలో ఎన్నికలకు రెండు నెలల ముందు కూడా పింఛన్ కేవలం రూ.1000 మాత్రమే. ఇది కూడా ఆలోచన చేయండి. ఆ రోజు కూడా ఆ ఎన్నికలకు రెండు నెలల ముందు కూడా ..ఎన్నికలకు రెండు నెలల ముందు పింఛన్ రూ.2 వేలు చేశాడు.
- ఎన్నికలు రాకపోయి ఉంటే..మీ బిడ్డ జగన్ రూ.2 వేలు ఇస్తానని చెప్పకపోయి ఉంటే ఆ పింఛన్ పెంచేవాడా? మీ గుండెలపై చేతులు వేసుకొని ఆలోచన చేయండి.
- గత ఐదేళ్ల చంద్రబాబు పాలనలో యావరేజ్ కింద పింఛన్ కేవలం రూ.58 వేలు ఇస్తే..మీ బిడ్డ పాలనలో అవ్వాతాతల చేతుల్లో ఈ నాలుగున్నరేళ్ల పాలనలో అక్షరాల రూ.1.47 లక్షలు పెట్టాను.
- వికలాంగులను లెక్కల్లో వేసుకుంటే రూ.1.82 లక్షలు పెట్టాను. గతానికి ఇప్పటికి మధ్య తేడా గమనించండి.
- గతంలో పెంఛన్ కావాలంటే పడిగాపులు కావాలి. పింఛన్ కావాలంటే జన్మభూమి కమిటీలకు లంచాలు ఇవ్వాలి. పింఛన్‌ఎప్పుడు ఇస్తారో తెలియదు..పింఛన్ తీసుకోవాలంటే లైన్లలో నిలబడాలి.
- ఒకవైపు లంచాలు, మరోవైపు వివక్ష, మరో వైపు చెంతాడంత క్యూలైన్లు, ఈ రోజు ఎవరికి పింఛన్ కావాలన్నా అర్హత ఉంటే చాలు మంజూరు చేస్తున్నాం.
- ఈ రోజు గ్రామాల్లో గ్రామ సచివాలయ వ్యవస్థ వచ్చింది. కులం, మతం, ప్రాంతం,వర్గం చూడటం లేదు. చివరికి ఏ పార్టీ అని చెప్పి ఎవరూ అడగడం లేదు. అర్హత ఉంటే చాలు మీ కష్టం నా కష్టంగా భావించి ఈ రోజు ప్రతి ఒక్కరికి తోడుగా అండగా నిలబడే కార్యక్రమం ఈ రోజు మీ బిడ్డ పాలనలోనే జరుగుతుందని చెప్పడానికి గర్వపడుతున్నాను.
- అక్కచెల్లెమ్మలకు మంచి చేయాలి..ఆ కుటుంబాలకు మంచి చేయాలని మీ బిడ్డ పరుగెత్తుంటే..ఐదేళ్లు గతంలో సీఎంగా ఉన్న ఒకాయన ఉన్నారు. ఆయనకు ఒక దత్తపుత్రుడు ఉన్నాడు. ఆ ఇద్దరు కలిసి 2014లో ఎన్నికల ప్రణాళికలో వాళ్లు చెప్పిన మాట..ప్రతి పేదవాడికి మూడు సెంట్ల స్థలం, అందులో ఇళ్లు కట్టిస్తామని వాగ్ధానం చేశారు. చివరకు ఒక్క సెంట్ కూడా ఇవ్వలేదు. అడ్డగోలుగా దత్తతండ్రి మోసం చేస్తే..ఈ దత్తపుత్రుడు కనీసం ప్రశ్నించలేదు. కేంద్రానికి ఒక లేఖ కూడా రాయలేదు. మీ బిడ్డ అక్షరాల 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి మీ ముఖాల్లో సంతోషం చూస్తుంటే.. ఇదే దత్తపుత్రుడు ఇవాళ కేంద్రానికి లేఖలు రాస్తున్నాడు. పేదలకు కట్టే ఇళ్లలో అవినీతి జరిగిందని కేంద్రానికి లేఖలు రాసి ఇంటి నిర్మాణాలు ఆపాలని చూసిన దిక్కుమాలిన వ్యక్తి ఈ అన్యాయస్థులే.
- ఈ రోజు అవినీతి పరుడు చంద్రబాబు అని కేంద్రానికి చెందిన ఇన్‌కం ట్యాక్స్ డిపార్టుమెంట్ చంద్రబాబుకు సమాన్లు ఇస్తే..కోర్టు కూడా దాన్ని నిర్ధారించి చంద్రబాబును జైల్లో పెడితే..జైల్లోకి వెళ్లి ఈ దత్తపుత్రుడు దత్తతండ్రిని పరామర్శిస్తాడు. ఇంత అవినీతిపరుడు దేశంలో ఎవరూ లేకపోయినా కూడా ఈ పెద్దమనిషి చాలా మంచి వ్యక్తి అని కితాబు ఇస్తాడు. అవినీతి చేయకపోయినా మన ప్రభుత్వంపై అబాం«ఢాలు వేస్తాడు.తేడా గమనించండి.
- చంద్రబాబు అవినీతి చేసినా కూడా దత్తపుత్రుడు ఎందుకు నోరుమోదపడం లేదంటే..ఆ అవినీతిలో ఈయన కూడా పార్ట్‌నర్. ఈనాడు, ఆంధ్రజ్యోతిలో రాయరు. టీవీ5లో చూపించరు. దత్తపుత్రుడు ప్రశ్నించడు.
- గత ప్రభుత్వంలో చంద్రబాబు నొక్కిన బటన్లు ఎన్ని అడగండి. గతంలో చంద్రబాబు నొక్కిన బటన్లు సున్నా..పేదలకు ఇచ్చింది అరకొర. అదే మీ బిడ్డ ప్రభుత్వంలో ప్రతి ఒక్క పేదవాడికి సంక్షేమం రూపంలో నేరుగా ఈ రోజు బటన్ నొక్కడం, నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా రూ.2.46 లక్షల కోట్లు జమ చేశా. ఎక్కడా లంచాలు లేవు. ఎక్కడా వివక్ష లేదు. ఆలోచన చేయమని అడుగుతున్నాను.
- మీ బిడ్డ ఎందుకు చేయగలిగాడు. అప్పట్లో చంద్రబాబు ఎందుకు చేయలేకపోయాడు. అదే రాష్ట్రం, అదే బడ్జెట్..అప్పుల గ్రోత్‌రేట్ అప్పటి కన్నా ఇప్పుడు తక్కువ.
- ఒక్క వ్యక్తి మారడంతో ఈ రోజు రూ.2.46 లక్షల కోట్లు నా అక్కచెల్లెమ్మల చేతుల్లోకి చేరాయి. ఆలోచన చేయండి.
- అప్పట్లో ఎందుకు ఈ బటన్లు నొక్కే కార్యక్రమం జరుగలేదు. ఎందుకు ఇంత డబ్బు ఇవ్వలేకపోయారు. అప్పట్లో పేదవారి ముఖంలో చిరునవ్వు చూడాలని పాలన చేయలేదు. అప్పట్లో దోచుకోవడం, దోచుకున్నది పంచుకునే పాలన సాగింది.
- అప్పట్లో గొప్ప గజదొంగల ముఠా పాలన చేసింది. ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5, ఒక దత్తపుత్రుడు. వీరంతా కలిసి దోచుకుని పంచుకుని తిన్నారు. డీపీటీ పాలన అప్పట్లో జరిగింది. ఇప్పుడు డీబీటీ పాలన సాగుతోంది.
- మారిందల్లా కేవలం ముఖ్యమంత్రి మాత్రమే:
- చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అమ్మ ఒడి స్కీమే లేదు.ఈ ఒక్క స్కీమ్‌ద్వారా ఈ ఐదేళ్లలో మీ బిడ్డ 44.49 లక్షల మంది నా అక్కచెల్లెమ్మలకు మేలు చేస్తూ ..అక్షరాల మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా రూ.26 వేల కోట్లు మీ ఖాతాల్లోకి జమ చేశాను. మారిందల్లా కేవలం ఒకే ఒక వ్యక్తి..ముఖ్యమంత్రి మాత్రమే మారాడు. నా అక్కచెల్లెమ్మలకు అమ్మ ఒడి డబ్బులు ఇచ్చాను.
- చంద్రబాబు సీఎంగా ఉండగా రైతు భరోసా అనే స్కీమే లేదు.ఆ ఐదేళ్లు రైతు భరోసా స్కీమే లేదు. ఇవాళ ప్రతి ఏడాది అక్షరాల రూ.53.57 లక్షల మంది రైతులకు మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా రైతన్నల ఖాతాల్లో ప్రతి ఏటా రూ.13,500 జమ చేస్తున్నాం. ఈ స్కీమ్ ద్వారా ఈ ఐదేళ్లలో రూ.33,300 కోట్లు మీ బిడ్డ ఇచ్చాడు. మారిందల్లా కేవలం ఒకే ఒక వ్యక్తి. ముఖ్యమంత్రి మాత్రమే మారాడు. అదేరాష్ట్రం, అదే బడ్జెట్. ఆలోచన చేయండి.
- చంద్రబాబు సీఎంగా ఉండగా వైయస్‌ఆర్ ఆసరా అనే స్కీమే లేదు. ఈ ఒక్క పథకం ద్వారా అక్షరాల 78.94 లక్షల మంది పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు ఈ 55 నెలల్లో నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కి రూ.19,178కోట్లు నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశాను.
- చంద్రబాబు సీఎంగా ఉండగా వైయస్‌ఆర్ చేయూత అనే స్కీమే లేదు. 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు ఉన్న నా అక్కచెల్లెమ్మల బాగోగులు పట్టించుకున్న నాథుడే లేడు. వాళ్లు బాగుంటే వాళ్ల కుటుంబాలు బాగుంటాయని నమ్మిన మీ బిడ్డ నాఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటూ తోడుగా ఉంటూ ప్రతి ఏటా రూ. 18,500 డబ్బులు ఇస్తున్నాను. 26.48 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు మంచి చేస్తూ ..నేరుగా బటన్ నొక్కి రూ.14,169 కోట్లు జమ చేశాను.
- వైయస్‌ఆర్ నేతన్న నేస్తం ద్వారా రూ.982 కోట్లు నా నిరుపేద నేతన్నలకు అండగా నిలబడ్డాను. వైయస్‌ఆర్ వాహన మిత్ర ద్వారా నా డ్రైవర్ అన్నదమ్ములకు రూ.1302 కోట్లు నేరుగా జమ చేశాను.ఈ బీసీ నేస్తం ద్వారా రూ.1252 కోట్లు నా నిరుపేద అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశాను.
- ఆగ్రిగోల్డ్ బా«ధితులకు రూ.905 కోట్లు ఇచ్చాం. జగనన్న తోడు ద్వారా రూ.2,955 కోట్లు, జగనన్న చేదోడు ద్వారా రూ.1250 కోట్లు ఇచ్చాం. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చెంతాడంత ఉంటుంది. ఆలోచన చేయండి.
- ఎక్కడైనా కూడా లంచాలు, వివక్ష లేదు. ప్రతిదీ కూడా గ్రామ పంచాయతీలో లిస్టు పెడుతున్నాం. వాలంటీర్లు మీ ఇంటికి వచ్చి తోడుగా నిలబడుతున్నాడు. నేరుగా డబ్బులు పంపిస్తున్న ప్రభుత్వం మీ బిడ్డ పాలనలోనే జరుగుతుంది. ప్రతి విషయం కూడా ఆలోచన చేయండి.
- రాష్ట్రంలో ఇవాళ ఏ గ్రామం తీసుకున్నా కూడా ప్రతి గ్రామంలో కూడా మార్పు కనిపిస్తుంది. ప్రతి గ్రామంలో గతంలో లేనివిధంగా ఈ రోజు ఒక గ్రామ సచివాలయం కనిపిస్తుంది. అందులో పని చేస్తున్న 10 మంది మన పిల్లలు ఉద్యోగాలు చేస్తూ కనిపిస్తారు. ప్రతి 50 ఇళ్లకు ఒక తమ్ముడు, చెల్లెమ్మ వలంటీర్ల రూపంలో కనిపిస్తారు. ఇప్పటికే ఇంటి వద్దే అందుతున్న పింఛన్, రేషన్, ఇప్పటికే ఆ గ్రామంలో ఆర్‌బీకే, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం. ఇప్పటికే ఆ గ్రామంలోమారిన స్కూళ్లు కనిపిస్తాయి. నాడు–నేడుతో మార్పు కనిపిస్తుంది. మన పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు కనిపిస్తాయి. ఐఎఫ్‌పీ బోర్డులు కనిపిస్తాయి.
- మెరుగులు దిద్దిన 104, 108 వాహనాలు కనిపిస్తాయి. ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందుతుంది. చదువుతున్న పిల్లలకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ అందుతుంది.ఇవన్నీ కూడా కేవలం ఈ 55 నెలల కాలంలో మాత్రమే మీ బిడ్డ పాలనలోనే కనిపిస్తోంది.
- ఇంగ్లీష్ మీడియం అంటే మీ జగన్..ట్యాబ్‌లు అంటే మీ జగన్..గవర్నమెంట్ బడుల్లో ఐఎఫ్‌పీలు అంటే మీ బిడ్డ జగన్. పింఛన్ పెంచింది ఎవరంటే మీ జగనే. ఇవన్నీకూడా కేవలం ఈ 55 నెలల కాలంలోనే జరుగుతున్నాయి. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అబద్ధాలు చెబుతారు.ఇంకా మోసాలు చేసే పరిస్థితి వస్తుంది. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామని చెప్పే నాయకులు మీ ఇంటికి వస్తారు. ప్రతి ఇంటికి ఒక బెంజికారు ఇస్తామని చెప్పే నాయకులు మీ ఇంటికి వస్తారు. రాబోయే రోజుల్లో కుట్రలు, కుతంత్రాలు ఎక్కువగా జరుగుతాయి.
- రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారు. కుటుంబాలను చీల్చే రోజులు వస్తాయి. రాజకీయాలు చేస్తారు. అబద్ధాలు చెబుతారు. మోసాలు చేస్తారు. ఇవన్నీ జరుగుతాయి. గుర్తుపెట్టుకోమని కోరుతున్నాను.
- మీ బిడ్డకు వాళ్ల మాదిరిగా కుట్రలు చేయడం, కుతంత్రాలు పన్నడం చేతకాదు. మీ బిడ్డకు వాళ్ల మాదిరిగా రాజకీయాలు చేయడం చేతకాదు. మీ బిడ్డకు తెలిసిన రాజకీయం ఒక్కటే మంచి చేయడం, పేదవాడికి అండగా నిలబడటం, మీ బిడ్డ నమ్ముకున్నది కూడా పైన దేవుడిని, కింద మిమ్మల్ని మాత్రమే నమ్ముకున్నాడు.
- మధ్యలో దళారులను మీ బిడ్డ నమ్ముకోలేదు. మీ బిడ్డకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడుతోడుగా ఉండకపోవచ్చు. మీ బిడ్డ నమ్ముకున్నది పొత్తులను, ఎత్తులను, జిత్తులను, కుట్రలను కాదు. మీ బిడ్డ నమ్ముకున్నది పైన దేవుడిని, కింద ఉన్న మిమ్మల్ని మాత్రమేనని మరొక్కసారి తెలియజేస్తూ..అప్రమత్తంగా ఉండమని తెలియజేస్తూ..ఈ మంచి కార్యక్రమంలో మీ అందరితో పాటు మీ సంతోషాలతో ఈ కార్యక్రమం జరుపుకోవడం మీబిడ్డకు ఇంతకన్నా సంతోషం మరొక్కటి ఉండదని చెప్పడానికి గర్వపడుతున్నాను. సంతోషపడుతున్నానని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
- ఈ రోజు డాక్టర్ వైయస్‌ఆర్ స్కేటింగ్ రింక్‌ను రూ.9.50 కోట్లతో ప్రారంభించాం.
- నా సోదరుడి కుమారుడు రాకిరెడ్డి కళాక్షేత్రాన్ని రూ.20 కోట్లతో చేపట్టి ఈ రోజు ప్రారంభించాం.
- నేను గౌరవించేవారిలో ఒక్కరైన ముత్తా గోపాలకృష్ణ పేరుమీద ఆర్‌వోబీని రూ.65 కోట్లతో నిర్మించి ప్రారంభించాం.
- ట్రామా కేర్ సెంటర్‌ను రూ.15కోట్లతో నిర్మించి ప్రారంభించాం. దాదాపుగా 109 కోట్లతో ఈ రోజు ప్రారంభోత్సవాలు చేశాం.
- కాకినాడ మున్సిపాలిటీలో తాగునీటి కోసం రూ.47 కోట్లు మంజూరు చేస్తున్నాను.
- మీ అందరి ముఖాల్లో చిరునవ్వులు ఇలాగే ఉండాలని, నా పట్ల, ప్రభుత్వం పట్ల ఇలాగే మీ చిరునవ్వులు, ఆశీస్సులు ఉండాలని దేవుడిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానని సీఎం వైయస్ జగన్ తన ప్రసంగాన్ని ముగించారు.