Best Web Hosting Provider In India 2024
Fake Diamonds: బంగారం, వెండి, వజ్రాలు చేసిన ఆభరణాలకు గిరాకీ పెరిగిపోయింది. ముఖ్యంగా మహిళలకు బంగారం, వజ్రాలు అంటే ఎంతో ప్రీతి. విలువైన రాళ్లతో వజ్రాలతో చేసిన ఉంగరాలు ఆభరణాలను ఇష్టంగా కొని ధరిస్తారు. అన్నింట్లో వజ్రాల ధర ఎక్కువగా ఉంటుంది. వీటిలో నకిలీ వజ్రాలు కూడా ఇప్పుడు మార్కెట్లో చలామణిలో ఉన్నాయి. అసలైన వజ్రానికీ, నకిలీ వజ్రానికీ తేడా అర్థం చేసుకుంటే మోసపోకుండా ఉండవచ్చు. నకిలీ వజ్రాలను ఎలా గుర్తుపట్టాలో తెలుసుకునేందుకు చిన్నచిన్న పరీక్షలు ఉన్నాయి.
ట్రెండింగ్ వార్తలు
నీటి పరీక్ష
వజ్రాలు నకిలీవో, నిజమైనవో చెప్పే సులభమైన పరీక్షల్లో ఇది ఒకటి. దీనికి ఒక గ్లాసులో మూడు వంతులు నీటితో నింపి తీసుకోవాలి. సాధారణంగా తాగే నీటిని తీసుకుంటే చాలు. ఆ నీళ్లలో మీరు కొనాలనుకుంటున్న వజ్రాన్ని ఉంచాలి. ఆ వజ్రం మునిగితే అది స్వచ్ఛమైనదని, నిజమైనదని అర్థం. అలా కాకుండా మధ్యలో తేలుతూ పైకి కిందకు తేలుతూ ఉందంటే దాంట్లో గ్లాస్ లేదా క్వార్జ్ కలిపారని అర్థం చేసుకోవాలి. మంచి వజ్రం ఎప్పుడూ నీటిలో మునిగిపోతుంది.
ఫాగ్ టెస్ట్
వజ్రాల స్వచ్ఛతనాన్ని పరీక్షించడంలో ఫాగ్ టెస్ట్ కూడా సులభమైనదే. ఇది సురక్షితమైన ప్రయోగం. ఒక వజ్రాన్ని రెండు వేల మధ్య పట్టుకోండి. దానిపై నోట్లోంచి కొంత గాలిని బలంగా ఊదండి. నిజమైన వజ్రమైతే ఉపరితలంపై నోట్లోంచి వచ్చిన పొగ మంచులాంటి తడి వెంటనే మాయమవుతుంది. అదే నకిలీదైతే కొన్ని సెకన్ల పాటు ఆ పొగ మంచు అలాగే ఉంటుంది. నిజమైన వజ్రం వేడిని త్వరగా బయటికి పంపించేస్తుంది. నకిలీవి మాత్రం ఆ లక్షణాన్ని కలిగి ఉండదు.
మెరుపు పరీక్ష
వజ్రాలు ఎల్లప్పుడూ మెరుస్తాయి. స్వచ్ఛమైన వజ్రం లోపల నుండి బూడిద రంగు, తెలుపు రంగులో ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఆ తరువాత ఇంద్రధనస్సు రంగుల్లో చెల్లాచెదురు అయినట్టు ఆ కాంతి కనిపిస్తుంది. అదే నకిలీది అయితే దాని స్పెక్ట్రంలో బూడిద రంగు, తెలుపు రంగు అనేవి కనబడవు. కేవలం ఇంద్రధనస్సు రంగులు మాత్రమే కనిపిస్తాయి.
డాట్ టెస్ట్
ఒక కాగితంపై నల్ల ఇంకు పెన్నుతో చిన్న చుక్కను పెట్టండి. ఈ వజ్రాన్ని తీసుకెళ్లి ఆ చుక్కపై ఉంచండి. నిజమైన వజ్రం అయితే ఆ చుక్కను మీకు చూపించదు. ఎటువైపు నుంచి చూసినా కూడా ఆ చుక్క మీకు వజ్రం నుంచి కనబడదు. అదే నకిలీది అయితే వజ్రం నుంచి చూసినప్పుడు ఆ చుక్క మీకు కనిపించే అవకాశం ఉంటుంది.
టాపిక్