
Best Web Hosting Provider In India 2024

Tyson Naidu Glimpse: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న మూవీ టైసన్ నాయుడు. తాజాగా బుధవారం (జనవరి 3) అతని బర్త్ డే సందర్భంగా మూవీ గ్లింప్స్ రిలీజ్ చేశారు. అప్పట్లో ఒకడుండేవాడు, భీమ్లా నాయక్ ఫేమ్ సాగర్ కే చంద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు టైసన్ నాయుడు అనే టైటిల్ పెట్టడం విశేషం.
ట్రెండింగ్ వార్తలు
మూవీ గ్లింప్స్ లోనే బెల్లంకొండ శ్రీనివాస్ తన మాస్ అవతార్ చూపించాడు. హిందీలో ఛత్రపతి రీమేక్ తర్వాత అతడు నటిస్తున్న సినిమా ఇది. ఇందులో డీఎస్పీ పాత్రలో శ్రీనివాస్ కనిపించనుండటం విశేషం. నిమిషం నిడివి ఉన్న ఈ గ్లింప్స్ ను ఫుల్ యాక్షన్ తో నింపేశారు. బెల్లంకొండ చేసిన స్టంట్స్ అభిమానులను ఆకట్టుకుంటాయనడంలో సందేహం లేదు.
రంకెలేస్తూ వస్తున్న దున్నపోతును కూడా పడేస్తానంటూ పోలీసులకు ట్రైనింగ్ ఇచ్చే ఓ బాక్సర్ డైలాగుతో గ్లింప్స్ మొదలువుతుంది. అది విని డీఎస్పీ స్థాయి అధికారి హోదాలో ఆ ట్రైనింగ్ లో ఉన్న హీరో నవ్వుతాడు. తర్వాత మొత్తం యాక్షన్ సీక్వెన్స్‌లే. అయితే వీటిని చాలా అద్భుతంగా చూపించారు. హిందీ ఛత్రపతి మూవీలో చాలా పవర్‌ఫుల్ గా కనిపించిన బెల్లంకొండ శ్రీనివాస్.. ఈ మూవీలోనూ అదే కొనసాగించాడు.
టైసన్ నాయుడు అనే టైటిల్ తోనే మేకర్స్ అభిమానులను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఇక మూవీలో హీరోని కూడా టైసన్ రేంజ్ లో యాక్షన్ సీన్స్ లో చూపించడం విశేషం. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. రామ్ ఆచంట, గోపీ ఆచంట.. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో టైసన్ నాయుడు మూవీని నిర్మిస్తున్నారు. భీమ్స్ సీసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నాడు.
టాపిక్