Best Web Hosting Provider In India 2024
Rusk Halwa: క్యారెట్ హల్వా, బీట్రూట్ హల్వా, బ్రెడ్ హల్వా తినే ఉంటారు. మిగిలిపోయిన రస్కులతో కూడా టేస్టీగా హల్వా చేసుకోవచ్చు. సాయంత్రం పూట స్నాక్ గా ఇది ఉపయోగపడుతుంది. దీని తయారీలో పాలు, యాలకులు, జీడిపప్పు, నెయ్యి వంటివి ఉంటాయి. ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ఈ రస్క్ తో హల్వా ఎలా చేయాలో చూద్దాం.
ట్రెండింగ్ వార్తలు
రస్క్ హల్వా రెసిపీ కి కావలసిన పదార్థాలు
రస్కులు – 200 గ్రాములు
పాలు – పావు లీటరు
పంచదార – పావు కిలో
జీడిపప్పు – 15
యాలకుల పొడి – అర స్పూను
నెయ్యి – అరకప్పు
ఉప్పు – చిటికెడు
రస్క్ హల్వా రెసిపీ
1. స్టవ్ వెలిగించి పైన మందపాటి గిన్నెను పెట్టుకోవాలి.
2. పాలను పోసి మరిగించుకోవాలి. పాలు మరుగుతున్నప్పుడు రస్కులను అందులో వేయాలి.
3. చిన్న మంట మీద ఉంచి కలుపుతూ ఉండాలి.
4. రస్కులు మెత్తబడి ముద్దగా మారుతాయి. ఆ తరువాత పంచదార వేసి బాగా కలపాలి.
5. మీకు తీయదనం ఎక్కువగా కావాలనిపిస్తే మరి కొంచెం అదనంగా పంచదారను వేసుకోవచ్చు. లేదంటే తగ్గించుకోవచ్చు.
6. చిటికెడు ఉప్పును కూడా వేసి బాగా కలపాలి.
7. ఆ తర్వాత నెయ్యిని వేసి కలుపుతూ ఉండాలి.
8. హల్వా లాగా వంటకం రెడీ అయ్యాక స్టవ్ కట్టేయాలి.
9. ఇప్పుడు పైన యాలకుల పొడిని చల్లుకోవాలి. నెయ్యిలో వేయించిన జీడిపప్పును కూడా పైన గార్నిష్ చేసుకోవాలి.
10. అంతే రస్క్ హల్వా రెడీ అయినట్టే.
11. అతిధులు ఇంటికి హఠాత్తుగా వచ్చినప్పుడు ఈ రెసిపీ పావుగంటలో రెడీ అయిపోతుంది. తినడానికి చాలా రుచిగా ఉంటుంది.