Krishna mukunda murari january 3rd episode: ముకుంద మీద అత్తాకోడళ్ల అనుమానం.. దేవ్ గుట్టు రట్టు కానుందా?

Best Web Hosting Provider In India 2024

Krishna mukunda murari january 3rd episode: మర్డర్ కేసుని ఈరోజే కేసు క్లోజ్ చేస్తాను మర్డర్ జరిగిన స్పాట్ కి వెళ్తున్నానని మురారి చెప్తాడు. భవానీ మాత్రం నువ్వు నటిస్తున్నావంటే నీకు కోపం వస్తుంది కానీ ఇప్పటికీ నువ్వు నటిస్తున్నావ్ అంటుంది. ఈ కేసులో మేమందరం ఆ లారీ డ్రైవర్ ని అనుమానిస్తున్నాం, మరి నువ్వు అతని దగ్గరకి వెళ్ళి విచారణ చేయకుండా మర్డర్ జరిగిన స్పాట్ కి వెళ్ళి ఏం చేస్తావ్ డెడ్ బాడీని విచారిస్తావా అంటుంది.

ట్రెండింగ్ వార్తలు

మీరు అన్నట్టు నాకు పెద్దపల్లి ప్రభాకర్ మీద అసలు అనుమానం లేదు. ఆయన చేయడనే నమ్మకం తప్ప.. అదే నిజం కూడా. అనుమానం కలగాల్సింది మీకు కాదు నాకు అంటే పోలీసులకి. రెండురోజుల్లో నా భార్యని కాదని వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవాలని నాకు గుర్తుంది. గుర్తుండి కూడా ఇలా మాట్లాడుతున్నానంటే దయచేసి అర్థం చేసుకొండని అంటాడు.

ముకుంద చేయించిందన్న కృష్ణ.. నమ్మని మురారి

మురారి కృష్ణ దగ్గరకి వస్తాడు. మనకోసం వెళ్ళిన దేవ్ తల పగలగొట్టారు. అసలు దీని వెనుక ఎవరు ఉన్నారో అర్థం కావడం లేదని మురారి అంటాడు. ముకుంద గురించి చెప్పాలని కృష్ణ మనసులో అనుకుంటుంది. నాకు ముకుంద మీద అనుమానంగా ఉందని కృష్ణ అనేసరికి మురారి షాక్ అవుతూ అదేంటి అంత మాట అనేశావని అడుగుతాడు. నేను అనుమానించడానికి కొన్ని కారణాలు ఉన్నాయని గతంలో జరిగిన కొన్ని సంఘటనలు చెప్తుంది. సర్జరీ చేయించిన వ్యక్తి పేరు అడిగితే ముకుంద ఎందుకు టెన్షన్ పడుతుంది. లేకపోతే దేవ్ అన్నయ్య మన వాడు అని ఎలా తెలుస్తుందని అంటుంది.

సొంత అన్నయ్యని ఎవరైనా అలా చేస్తారా? తన పెళ్లి ఆగిపోయి ఎక్కడ నువ్వు ఇంటికి వస్తావోనని తను టెన్షన్ పడి ఉంటుందని సర్ది చెప్తాడు. ఆ మాటకి కృష్ణ సరే అంటుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది వెళ్ళి చూసొద్దామని చెప్తాడు. రేవతి తన కొడుకు, కోడలు జీవితం ఏమైపోతుందా అని దేవుడికి మొరపెట్టుకుంటుంది. నందిని వచ్చి రేవతితో మాట్లాడుతుంది. వీళ్ళ పెళ్లి ఎన్ని దారుణాలకి దారి తీస్తుందోనని భయంగా ఉంది. వీళ్ళు కలిసి ఉంటే చూడలేని అంత దుర్మార్గులా అని రేవతి అంటుంది. ఆర్టిస్ట్ రాజ నర్స్ ఫోటో ఎందుకు వేశాడోనని నందిని కూడా అనుమానపడుతుంది. కావాలని అతన్ని ఇరికించాలని చూస్తున్నారు అలా అయితే పెళ్లి అయిపోతుందని ప్లాన్ చేసినట్టు ఉన్నారని రేవతి అంటుంది.

ముకుందని అనుమానించిన రేవతి ఖండించిన భవానీ

అసలు ఈ కేసులోకి రాజ నర్స్ కొడుకు ఎలా వచ్చాడో అర్థం కావడం లేదని మురారి అంటే కృష్ణ మళ్ళీ ముకుంద మీద ఉన్న అనుమానం గురించి చెప్తుంది. ముకుంద ఇలా చేసిందంటే నమ్మలేకపోతున్నానని అంటాడు. ఒక్కొక్కళ్ళకి ఒక్కో పిచ్చి ఉంటుంది. ముకుందకి ఆ అవసరం ఏముందని అంటాడు. ఉంది ముకుంద టార్గెట్ మీరు అందుకోసం ఎంతకైనా తెగించి ఉండవచ్చు కదా అంటుంది. కృష్ణ ఒకసారి తన చిన్నాన్నతో మాట్లాడదామని చెప్తుంది. పెళ్లి దగ్గర పడింది కదా ఏమైనా తెలిసిందా అని అడుగుతాడు. తెలుస్తుందని కృష్ణ ధైర్యం చెప్తుంది. ఎట్టి పరిస్థితిలోను కృష్ణని వదిలిపెట్టనని ప్రభాకర్ కి ధైర్యం చెప్తాడు.

భవానీ ప్రభాకర్ కిరాతకంగా ప్రవర్తించాడని మనసులో అనుకుంటుంది. అప్పుడే రేవతి వచ్చి తనకి ఎందుకో భయంగా ఉందని అంటుంది. వీటి కంటే ముందు ఒక భార్య కుట్ర చేసింది, రూపం మార్చి మనల్ని మోసం చేయాలని చూసిందని కృష్ణని తిడుతుంది. ప్రభాకర్ అన్నయ్య అటువంటి మనిషి కాదని రేవతి చెప్తుంది. నాకు ఎందుకో ఇవన్నీ ముకుంద మనుషులు చేస్తున్నారని అనిపిస్తుందని రేవతి తన అనుమానం బయట పెడుతుంది. నేను కృష్ణ మనుషులంటే నువ్వు ముకుంద మనుషులు అంటున్నావా గుడ్ అని భవానీ అంటుంది. ఎన్ని చెప్పినా కూడా భవానీ మాత్రం కృష్ణ, ప్రభాకర్ చేశారని ఇదే నిజమని చెప్తుంది.

కీలక ఆధారం పట్టుకున్న కృష్ణ

ఆర్టిస్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్, డెడ్ బాడీ ఫోటోస్ మురారి చేతికి వస్తాయి. వాటిని కృష్ణ కూడా చూస్తుంది. శ్రీధర్ మొహం మీడ ఒక గుర్తు ఉండటం చూసి మురారికి చూపిస్తుంది. శ్రీధర్ ని పిడికిలి బిగించి కొడితే వాడి ఉంగరం గుర్తు మొహం మీద పడిందని అదే ఆ మార్క్ అని మురారి చెప్తాడు. శ్రీధర్ అకౌంట్ లోకి డబ్బులు క్రెడిట్ అయిన విషయం మురారికి తెలుస్తుంది. డబ్బులు వేసిన వ్యక్తి ఫోన్ నెంబర్ కశ్మీర్ దని చెప్తాడు. కాశ్మీర్ అంటే ఆదర్శ్ అని కృష్ణ అంటే వాడికి అలాంటి అవసరం లేదని మురారి అంటాడు. ఈ ఉంగరం గుర్తు ఎవరిదో తేల్చాలని డిసైడ్ అవుతారు. ముకుంద గదిలో కూర్చుని టెన్షన్ పడుతూ ఏడుస్తుంది. దేవ్ వచ్చి ఎందుకు ఏడుస్తున్నావ్ ఏమైందని ఇప్పుడని అంటాడు. నేను దొరికిపోను ఎందుకు టెన్షన్ పడుతున్నావని అడుగుతాడు.

ప్రేమ, పెళ్లి విషయం మేమిద్దరం మాట్లాడుకొని పరిష్కరించుకోవాలి కానీ నేను మాత్రం ఇలా వెనుక ఉండి నడిపిస్తుంటే టెన్షన్ గా ఉందని చెప్తుంది. మురారికి ఇష్టం లేకపోతే ఇలాగే చేయాలి. ఎలాగోలా పెళ్లి చేసే బాధ్యత తనదని చెల్లెలికి ప్రామిస్ చేస్తాడు. అప్పుడు దేవ్ చేతి ఉంగరం చూపిస్తారు. నా ఫోన్ నెంబర్ ట్యాప్ చేసిన దొరకని నాది కశ్మీర్ నెంబరని చెప్తాడు. ముకుందతో మీ పెళ్లి చేయాలని బలంగా పూనుకుంది పెద్దత్తయ్య కదా తను కాక ఇంకెవరూ ఉన్నారని కృష్ణ అనుమానిస్తుంది.

తరువాయి భాగంలో..

అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర ఉండగా భవానీ రేపు ముకుంద, మురారికి నలుగు పెట్టాలని చెప్తుంది. ఆ మాటకి కృష్ణ, మురారి మొహమొహాలు చూసుకుంటారు. తన చెల్లి కృష్ణకి అన్యాయం జరుగుతుందని భోజనం కూడా సహించడం లేదని దేవ్ ఓవర్ యాక్షన్ చేయాలని చూస్తాడు. అప్పుడే కృష్ణ దేవ్ చేతికి ఉన్న ఉంగరం చూస్తుంది. శ్రీధర్ మొహం మీద ఉన్న ఉంగరం గుర్తు ఆదేనని గుర్తుపడుతుంది.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024